ఆస్కార్ కు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ సృష్టించింది. అందరి అంచనాల్ని నిజం చేస్తూ ఈ సినిమా ఆర్ఆర్ఆర్ కు నామినేట్ అయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు-నాటు పాటను నామినేట్ చేసినట్టు…

ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ సృష్టించింది. అందరి అంచనాల్ని నిజం చేస్తూ ఈ సినిమా ఆర్ఆర్ఆర్ కు నామినేట్ అయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు-నాటు పాటను నామినేట్ చేసినట్టు అకాడమీ ప్రకటించింది. మరో 4 ఒరిజినల్ సాంగ్స్ తో నాటు-నాటు పాట పోటీ పడబోతోంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో నాటు-నాటు పాట సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అవార్డ్ అందుకుంది. గోల్డెన్ గ్లోబ్ అందుకున్న వెంటనే, ఈ పాటకు ఆస్కార్ అవకాశాలు మరింత మెరుగైనట్టు హాలీవుడ్ మీడియా కథనాలిచ్చింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే టాప్-5 లిస్ట్ లో నాటు-నాటు సాంగ్ చోటు సంపాదించుకుంది.

టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్, టాప్ గన్ మేవరిక్, బ్లాక్ పాంథర్-వకాండా ఫరెవర్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాల్లోని 4 సాంగ్స్ తో ఆర్ఆర్ఆర్ లోని నాటు-నాటు పాట పోటీ పడబోతోంది.

మొత్తం నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ ఒక్క విభంగాంలో మాత్రమే నామినేషన్ దక్కింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగాల్లో ఈ సినిమా నామినేట్ అవుతుందని చాలామంది భావించారు. కానీ అది జరగలేదు. ఇక ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లిన ఛెల్లాషోకు ఏ విభాగంలోనూ నామినేషన్ దక్కలేదు.