శర్వానంద్ పెళ్లి మేటర్ గురించి అందరికీ తెలిసిందే. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాల్ని అతడు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఇప్పటికే స్టోరీలు వచ్చేశాయి. అయితే అమ్మాయి పేరును మాత్రం ఎవ్వరూ బయటపెట్టలేదు. ఇప్పుడా వివరాలు కూడా బయటకొచ్చాయి.
శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షితా రెడ్డి. బొజ్జల మనవరాలు ఈమె. రక్షితా తండ్రి మధుసూధన్ రెడ్డి హైకోర్టు లాయర్. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి.
శర్వానంద్-రక్షిత ఎంగేజ్ మెంట్ ఈనెలలోనే ఉంటుంది. కాకపోతే కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరగబోతోంది. ఇక పెళ్లిని వేసవిలో జరపాలని అనుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించబోతున్నారు.
38 ఏళ్ల శర్వానంద్, టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు వరుసగా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేయడంతో, శర్వాపై ఒత్తిడి పెరిగింది. చివరికి ఓ టాక్ షోలో బాలకృష్ణ కూడా శర్వాను ఇదే ప్రశ్న అడిగేశారు.
ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాత తను పెళ్లి చేసుకుంటానంటూ ఆ టాపిక్ నుంచి తప్పించుకున్నాడు శర్వానంద్. కానీ ఇప్పుడు ప్రభాస్ కంటే ముందే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఒకే ఒక జీవితం సినిమాతో రీసెంట్ గా సక్సెస్ అందుకున్నాడు శర్వానంద్.