డిసెంబర్ 31 రాత్రి.. ఆర్ఆర్ఆర్ హంగామా

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ముంబయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఫొటోలు మాత్రమే బయటకొచ్చాయి.…

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ముంబయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఫొటోలు మాత్రమే బయటకొచ్చాయి. ఎట్టకేలకు ఆ మెగా ఈవెంట్ ప్రేక్షకులముందుకు రాబోతోంది.

డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి ఆర్ఆర్ఆర్ ముంబయి ఈవెంట్ ను ప్రసారం చేయబోతోంది జీ ఛానెల్. జీ గ్రూప్ లోని కీలకమైన అన్ని ఛానెల్స్ లో (హిందీ, తెలుగు, తమిళ్) ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి మేజర్ నాన్-థియేట్రికల్ రైట్స్ ను జీ-గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ డీల్ లోనే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ రైట్స్ కూడా ఉన్నట్టున్నాయి.

ఇక ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఏం జరిగిందనే విషయం ఇప్పటికే బయటకొచ్చింది. సల్మాన్ ఖాన్ తన భజరంగీ భాయ్ జాన్ కు సీక్వెల్ ప్రకటించాడు. హీరోలు చరణ్-తారక్ డాన్స్ చేశారు. వీళ్లతో పాటు సల్మాన్ కూడా డాన్స్ చేశాడు. శ్రియ, కరణ్ జోహార్, అలియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇవన్నీ డిసెంబర్ 31 రాత్రి చూడొచ్చన్నమాట.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ గ్రూప్ దక్కించుకుంది. దీంతోపాటు హిందీ శాటిలైట్ రైట్స్ కూడా ఆ సంస్థకే దక్కాయి. తెలుగు శాటిలైట్ రైట్స్ మాత్రం స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది.