ఆరు నూరైనా, నూరు ఆరైనా విడుదల దిశగా ముందకు వెళ్లడానికే ఆర్ఆర్ఆర్ టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా కరోనా మూడో దశ కమ్ముకు వస్తోంది. ప్రతి రాష్ట్రంలో ఏదో మేరకు కరోనా నిబంధనలు విధిస్తున్నారు. చాలా చోట్ల సెకెండ్ షో లేదు. జనాల్లో భయం ఇంతో అంతో పెరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో జనవరి 7న విడుదల కావాల్సి వుంది ఆర్ఆర్ఆర్. వాయిదా తప్పదేమో అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ సెకండ్ షో లేకపోయినా ఏదో ఒక విధంగా మేనేజ్ చేయవచ్చని, అలాగే యాభై శాతం ఆక్యుపెన్సీ కూడా సమస్య కాదని ఆర్ఆర్ఆర్ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి ఫస్ట్ వీక్ తరువాత పెద్దగా ఆంక్షలు వుండవని, పరిస్థితి సద్దు మణుగుతుందని భావిస్తున్నారు.
పైగా ఇప్పుడు వాయిదా అంటే అస్సలు కుదరని పరిస్థితి. ఎందుకంటే బాలీవుడ్ లో పబ్లిసిటీ పీక్స్ లో వుంది. ఓవర్ సీస్ లో టికెట్ లు విక్రయించారు థియేటర్లు బుక్ చేసారు. అక్కడ సినిమా వేయకుంటే నష్టం ఓ రేంజ్ లో వుంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే వెళ్లాలి.
ఒక్కటే సమస్య 7వ తేదీలోగా కరోనా మూడో దశ పెరగకూడదు థియేటర్లు మూత పడకూడదు. అది జరిగితే మాత్రం ఎవ్వరూ కాపాడలేదు. అలా జరగనంత వరకు ఆర్ఆర్ఆర్ విడుదల పక్కా అని తెలుస్తోంది.