ఆర్ఆర్ఆర్ రూటు వేరట

మిగిలిన సినిమాల షూటింగ్ లు వేరు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ వేరు అంట. కేవలం నాలుగు గోడల మధ్య, అది కూడా ఐసోలేట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో కామ్ గా జరిగే షూటింగ్ అంట. పైగా…

మిగిలిన సినిమాల షూటింగ్ లు వేరు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ వేరు అంట. కేవలం నాలుగు గోడల మధ్య, అది కూడా ఐసోలేట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో కామ్ గా జరిగే షూటింగ్ అంట. పైగా మాస్క్ లు, థెర్మల్ టెస్టర్లు, ఇలాంటి జాగ్రత్తలు అన్నీ వున్నాయట. 

అందువల్ల కనీసం జూన్ నుంచి తమ షూటింగ్ కు అనుమతి ఇవ్వాలని ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రభుత్వాన్ని కోరాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతానికి అలా వేచి వున్నారు. పరిస్థితులను గమనిస్తూ.  జూన్ ఫస్ట్ కు కనుక షూటింగ్ లకు అనుమతి వస్తే సరే సరి.  లేదూ అంటే ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి కోరే ఆలోచన కూడా ఆర్ ఆర్ ఆర్ కు వుందని బోగట్టా.

ఈ మేరకు లాక్ డౌన్ కు ముందు తాము తీసుకున్న జాగ్రత్తలు, అన్నీ తెలియచెప్పి, అనుమతి కోరే ఆలోచన వుందని టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఆ విధంగా జూన్ 1 కి కనుక షూటింగ్ ప్రారంభించగలిగితే సినిమా  ను జనవరికి విడుదల చేసుకోవడం వీలు అవుతుందని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావిస్తోంది. కానీ లాక్ డౌన్ వ్యవహారం ఏమాత్రం బిగుసుకున్నా, జూలై వరకు షూటింగ్ లకు అనుమతి, అలాగే ఇంటర్నేషనల్ ఫ్లయిట్ ల ఆపరేషన్ లేటు అయితే మాత్రం ఇక సమ్మర్ 2021 కు వెళ్లక తప్పదు.

ఆర్ఆర్ఆర్ మళ్ళీ మారింది