గుంటూరులో మరో 3.. ఏపీలో కరోనా పరిస్థితి ఇది!

గుంటూరులో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. నిన్న సాయంత్రం 7, ఈరోజు ఉదయానికి 8 కేసులు బయటపడగా.. తాజాగా మరో 3 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి…

గుంటూరులో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. నిన్న సాయంత్రం 7, ఈరోజు ఉదయానికి 8 కేసులు బయటపడగా.. తాజాగా మరో 3 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించిన టెస్టుల్లో గుంటూరులో మరో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93కు చేరింది.

అటు గుంటూరులో వెలుగుజూసిన 3 కేసులతో పాటు.. నెల్లూరులో మరో 4 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మొత్తంగా ఈ 7 కేసులతో కలుపుకొని రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 439కి పెరిగింది. ఈ రెండు జిల్లాలు మినహా మరే జిల్లా నుంచి కొత్తగా పాజిటివ్ కేసులు బయటపడకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం.

మరోవైపు కరోనా నియంత్రణకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులంతా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా కార్డ్ లేకుండా రేషన్ అడిగితే వాళ్లకు ఇబ్బందులు ఏమైనా ఉంటే, అప్పటికప్పుడు పరిశీలన చేసి బియ్యం ఇవ్వాలని సూచించారు. అలాగే అందరికీ వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు. కార్డులు లేకుండా రేషన్ అడుగుతున్న వాళ్లందరితో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేయించాలని సూచించారు.

అటు లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రథమ స్థానం దక్కింది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఛానెల్ ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో ఏపీ, రెండో స్థానంలో కేరళ నిలిచాయి.

ఆర్ఆర్ఆర్ మళ్ళీ మారింది