Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్టార్‌ మాలో రుద్రమదేవి వీరగాధ!!

స్టార్‌ మాలో రుద్రమదేవి వీరగాధ!!

రుద్రమదేవి...బాధ్యతలో తన అర్హతను నిరూపించుకున్న మహిళపాలనలో తనపైన రాజ్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టిన మహిళ. ఆ పేరు తలుచుకుంటేనే ప్రతి తెలుగు హృదయం ఉప్పొంగుతుంది. 

అలాంటి కథని బుల్లితెరపై అందిస్తే...? ఈ ఆలోచనతో రుద్రమదేవి” చారిత్రక ధారావాహికను తమ అభిమాన ప్రేక్షకులకు సగర్వంగా సమర్పిస్తోంది స్టార్‌ మా.

ఇంటింటికీ ఓ ప్రతిష్టాత్మకమైన ధారావాహికగా, ఉన్నతమైన సాంకేతికప్రమాణాలతో అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కథల ఎంపికలో ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వేసి విలక్షణమైన కథల్ని అందించే స్టార్‌ మా ఇప్పుడు సాహసోపేతమైన ఈ

తెలుగింటి ఆడపడుచు వీరోచిత పోరాటగాధని సమర్పిస్తోంది.బడ్జెట్‌ విషయంలో, ప్రమాణాల విషయంలో ఏ మాత్రం వెనకడుగు లేకుండా ఒక అద్భుతాన్ని తమ ప్రేక్షకులకు కానుకగా అందిస్తోంది.

తెలంగాణ నేలపైన దశాబ్దాల క్రితంజరిగినా తరతరాలకు స్పూర్తిగా నిలిచిన ఈ వీరనారి విజయగాధ అందించే స్పూర్తి ఓ బుల్లితెర అద్భుతం లా రూపుదిద్దుకుంది. తెలుగువారు కనీవినీ ఎరుగని స్థాయిలో బుల్లితెరకు వన్నె తెచ్చేలా జాతీయ స్టాయి బృందం ఈ సీరియల్‌ కోసం పనిచేస్తున్నారు.

ఈ మెగా ప్రాజెక్ట్‌ 'రద్రమదేవి' స్టార్‌ మా లో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. ఎప్పటికీ గుర్తుండే ఈ 'రుద్రమదేవి' కథ. ఎప్పటికీ గుర్తుండే ధారావాహికలా తెలుగిళ్లలో వినోదానికి ఓ సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వబోతోంది స్టార్‌ మా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?