Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లి ఎప్పుడు.. అమ్మను అడిగి చెబుతా

పెళ్లి ఎప్పుడు.. అమ్మను అడిగి చెబుతా

పెళ్లి ఎప్పుడు? ఈ ప్రశ్నకు హీరోయిన్లు చెప్పే సమాధానాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఓవైపు డేటింగ్ చేస్తూ, మరోవైపు కెరీర్ పై దృష్టి పెట్టామంటారు కొందరు. మరికొందరు ప్రేమిస్తున్న విషయాన్ని ఓపెన్ గా చెబుతుంటారు. ఇంకొందరు మాత్రం ఇంకా టైమ్ ఉందని తప్పించుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ రుహానీ శర్మ వంతు వచ్చింది.

పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు ఈ బ్యూటీ భలే తెలివిగా సమాధానం ఇచ్చింది. అమ్మను అడిగి చెబుతానంది. ఈ ఒక్క  రిప్లయ్ లో బోలెడన్ని సమాధానాలు ఊహించుకోవచ్చు. 

తను ఎవ్వర్నీ లవ్ చేయడం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని అనుకోవచ్చు. ఆల్రెడీ వరుడు ఫిక్స్ అయ్యాడు, బయటకు చెప్పాలా వద్దా అనేది అమ్మను అడిగి చెబుతా అనే అర్థం కూడా తీసుకోవచ్చు.

రుహానీ శర్మ రిప్లయ్ పై ఇలానే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రుహానీ మాత్రం ఇంతకుమించి వివరణ ఇవ్వలేదు.

చిలసౌ సినిమాతో తెలుగులో పాపులర్ అయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత హిట్ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం నాని నిర్మాతగా, మీట్ క్యూట్ అనే సినిమాలో నటిస్తోంది. సినిమాల కంటే హాట్ ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?