“ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. నాగార్జునకు వచ్చింది కేవలం వైరల్ ఫీవర్ మాత్రమే. అంతకుమించి ఇంకే ఆరోగ్య సమస్యలు లేవు. దయచేసి రూమర్లు క్రియేట్ చేయకండి.” అక్కినేని అభిమానుల వాట్సాప్ గ్రూపుల్లో నిన్నంతా చక్కర్లుకొట్టిన సందేశం ఇది. జ్వరాలు ఎవరికైనా కామన్. పైగా సీజన్ మారుతున్న టైమ్ లో ఫీవర్ రావడం సహజం. కానీ నాగార్జున తనకొచ్చిన జ్వరంపై ఇలా స్వయంగా స్టేట్ మెంట్ ఇవ్వడం వెనక ఓ బలమైన గాసిప్ ఉంది.
మన్మథుడు-2 సినిమా కోసం నాగార్జున బాగా కసరత్తులు చేశాడు. ఉన్నంతలో కాస్త యంగ్ గా కనిపించేందుకు కఠిన ఆహార నియమాలు పాటించాడు. ఎక్సర్ సైజ్ మోతాదు కూడా పెంచాడు. ఆ సమయంలో ఆయన చేతికి దెబ్బ కూడా తగిలింది. ఇవన్నీ కలిసి ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయనేది తాజా పుకారు.
తీవ్రమైన వెన్ను నొప్పితో పాటు.. కొన్ని కీళ్ల సమస్యలతో నాగార్జున బాధపడుతున్నాడంటూ నిన్నంతో సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ప్రేక్షకులతో పాటు అభిమానులు దీన్నే నిజమని భావించే ప్రమాదం ఉండడంతో.. తన వ్యక్తులతో నాగార్జున స్వయంగా ఈ మెసేజ్ ను ఫ్యాన్ గ్రూప్ లో షేర్ చేయించాడు. తనకు జ్వరం తప్ప మరే సమస్య లేదని స్పష్టంచేశాడు.
ప్రస్తుతం నాగార్జున హైదరాబాద్ లోనే ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. పెద్దకొడుకు నాగచైతన్య, భార్య సమంతతో కలిసి స్పెయిన్ టూర్ లో ఉన్నాడు. చిన్న కొడుకు అఖిల్ మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నాడు.