సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు వసూళ్ల పరంగా నార్త్, ఓవర్సీస్ లో బాహుబలి-2ను క్రాస్ చేయలేకపోయింది. కానీ రెండు ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమా బాహుబలి-2 రికార్డుల్ని బద్దలుకొట్టి ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. ఆ రెండు ప్రాంతాల్లో నైజాం ఉండడం విశేషం.
అవును.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది సాహో. మొదటి రోజు ఈ సినిమాకు 9 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వచ్చింది. బాహుబలి-2 ఫస్ట్ డే కలెక్షన్ కంటే ఇది ఎక్కువ.
నైజాంలో భారీగా థియేటర్లు దక్కించుకోవడం, టిక్కెట్ రేట్లు పెంచడంతో పాటు బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఫలితంగా సాహో సినిమా నైజాంలో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది.
అటు నెల్లూరులో కూడా మొదటి రోజు వసూళ్లలో బాహుబలి-2ను అధిగమించింది సాహో.
ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ సినిమా మొదటి రోజే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రభాస్ ఇలా ఫస్ట్ డేనే వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించడం వరుసగా ఇది రెండోసారి. సౌత్ నుంచి ఇప్పటివరకు ఏ హీరో ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండుసార్లు వంద కోట్ల గ్రాస్ సాధించలేదు.
అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూసుకుంటే.. ఈ నెగెటివ్ టాక్ తో సాహో సినిమా బ్రేక్-ఈవెన్ అవుతుందా అవ్వదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
వరల్డ్ వైడ్ 319 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది సాహో సినిమా. అంత మొత్తాన్ని ఇది తిరిగి రాబడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఏపీ, నైజాంలో మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 9.40 కోట్లు
సీడెడ్ – రూ. 4.40 కోట్లు
నెల్లూరు – రూ. 2.21 కోట్లు
వెస్ట్ – రూ. 3.60 కోట్లు
ఈస్ట్ – రూ. 4.42 కోట్లు
కృష్ణా – రూ. 2.51 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.77 కోట్లు
గుంటూరు – రూ. 4.69 కోట్లు