Advertisement

Advertisement


Home > Movies - Movie News

సామీ, సామీ.. నాకు నడుంనొప్పి - రష్మిక

సామీ, సామీ.. నాకు నడుంనొప్పి -  రష్మిక

పుష్ప సినిమాలో సామీ సామీ పాటకు రష్మిక నడుము వంచి వేసే స్టెప్ చాలా పాపులర్. ఆ సినిమా విడుదలయ్యాక ప్రమోషన్ కోసం ఎక్కడికి వెళ్లినా రష్మిక ఆ స్టెప్ వేయనిదే వదిలేవారు కాదు ఆడియన్స్, మీడియా. టీనేజీ అమ్మాయిలు కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా రష్మిక సిగ్నేచర్ స్టెప్ వేయాల్సిందే. సహజంగా హీరోలకే ఇలాంటి సిగ్నేచర్ స్టెప్ లు పడుతుంటాయి. కానీ పుష్ప సినిమాతో రష్మిక ఆ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇదంతా పాత కథే అయితే ఇప్పుడు కొత్తగా ఆ స్టెప్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది రష్మిక.

ఓ అభిమాని రష్మికకి ఒక ప్రశ్న వేశాడు. తనను కలసినప్పుడు తనతో సామీ సామీ పాటకు డ్యాన్స్ చేయాలని కోరాడు. దీనికి స్పందించిన రష్మిక, ఇప్పటికే చాలా సార్లు ఆ పాటకి తాను స్టేజ్ లపై డ్యాన్స్ చేశానని, పెద్దయ్యాక తనకు నడుం నొప్పి వస్తుందేమోననే భయం కూడా ఉందని చెప్పుకొచ్చింది.

నిజంగానే సామీ సామీ పాటలో రష్మిక నడుం వంచి వేసే స్టెప్పు ఓ పట్టాన అందరూ కాపీ కొట్టలేరు. ఏదో జిమ్నాస్టిక్స్ చేసినట్టు కాస్త కష్టమైనే స్టెప్పే అది. కానీ ఆ మాస్ బీట్ కి రష్మిక అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చేసి, మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడేమో నడుం నొప్పి ఖాయమంటోంది.

మనం ఏం చేసినా కొంతమందికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు అంటూ వేదాంతం కూడా మాట్లాడింది రష్మిక. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై పరోక్షంగా స్పందించిన ఈ బ్యూటీ, అందరికీ నచ్చే విధంగా ఉండడం తనవల్ల కాదని స్పష్టం చేసింది.

త్వరలో విజయ్ తో మరో సినిమా చేయబోతున్నట్టు హింటిచ్చింది ఈ బ్యూటీ, ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ లో పాల్గొంటోంది. అన్నట్టు ఇకపై సౌత్ లో సినిమాల సంఖ్య పెంచుతానంటూ ప్రకటించి, పరోక్షంగా బాలీవుడ్ లో సినిమాలు తగ్గిస్తానని తెలిపింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?