కాషాయ రంగు బికినీ ఉందా లేదా? ఈ ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరికేసింది. థియేటర్లలోకి వచ్చిన పఠాన్ సినిమాలో దీపిక పదుకోన్ కాషాయ రంగు బికినీలో కనిపించింది. కాకపోతే సెన్సార్ కత్తెర్లు బాగా పడిన విషయం సినిమా చూస్తే అర్థమౌతోంది.
పఠాన్ సినిమా ప్రచారంలో భాగంగా బేషరమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో కాషాయ బికినీలో దీపికా పదుకోన్ దుమ్ముదులిపింది. అయితే ఆ రంగు బికినీ వేయడంపై కొన్ని వర్గాలు వివాదం రేపాయి. మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా రియాక్ట్ అయిన తర్వాత వివాదం మరింత ముసురుకుంది.
అలా వివాదాలతో భారీ ప్రచారం అందుకుంది పఠాన్ మూవీ. అయితే అదే వివాదం వల్ల సినిమా సెన్సార్ కత్తెర్లకు బలవ్వాల్సి వచ్చింది. బేషరమ్ సాంగ్ లో చిన్న చిన్న మార్పులు చేశారు. కొన్ని చోట్ల బికినీ సన్నివేశాల్ని తొలిగించారు. అయితే పూర్తిగా తీసేయలేదు. ఈరోజు రిలీజైన పఠాన్ సినిమాలో కాషాయ రంగు బికినీలో కనిపించింది దీపిక.
సాధారణంగా ఇంత వివాదం చెలరేగిన తర్వాత మేకర్స్ ఎవరైనా ఆ సన్నివేశాల్ని తొలిగిస్తారు. కానీ సినిమా యూనిట్ మాత్రం కాషాయ బికినీ సన్నివేశాలు కొన్నింటిని ఉంచింది. ఆ అందాలు చూసి ప్రేక్షకులు పండగ చేసుకున్నారు.