జనసేనాని పవన్‌కల్యాణ్‌కు జరిగిన అవమానం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన చెబితేనే లోకానికి తెలిసొచ్చింది. అది కూడా ఓ ఆంగ్లేయ మహిళ ఆయన్ను అవమానించడం ఘోరం, నేరం. పవన్ మీటింగ్ అంటే …గతాన్ని తవ్వుకోవడమనే సంగతి తెలిసిందే. జీవితంలో ఒక్కో దశలో తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి పవన్ తరచూ చెబుతుంటారు.
తాజాగా పవన్ జ్ఞాపకాల శిథిలాల నుంచి మరో ఆణిముత్యం బయట పడింది. ఇందుకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వేదికైంది. పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ఇవాళ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ….”నేను బ్రిటీష్ ఎయిర్‌వేస్ దగ్గర నేను వివక్షకు గురయ్యా. నాకు నీళ్లు ఇవ్వడానికి కూడా బ్రిటీష్ మహిళ నిరాకరించింది. మాకు గౌరవం ఇవ్వడం ఇష్టం లేకుంటే మా దేశంలో మీ ఎయిర్‌వేస్ నడపొద్దని చెప్పాను. పైలెట్ వచ్చి నాకు క్షమాపణ చెప్పారు” అని ఆయన చెప్పుకొచ్చారు.
విదేశాలకు వెళుతున్న సందర్భంలో ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు. బహుశా తన శీరరం తెల్లగా లేకపోవడం వల్ల వివక్షకు గురైనట్టు చెప్పారు. గంట నుంచి అడుగుతున్నా తనకు నీళ్లు ఇవ్వడానికి బ్రిటీష్ మహిళ నిరాకరిస్తూ, వివక్ష ప్రదర్శించడాన్ని పైలెట్ దృష్టికి తీసుకుపోయానన్నారు. వివక్షకు గురైన వాళ్లకే దాని గురించి బాగా తెలుస్తుందన్నారు.
రెల్లి కులస్తుడు తనను టచ్ చేయడానికి కూడా సంశయించాడని, ఇది తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇదిలా వుండగా సబ్‌ప్లాన్‌పై పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్య చేశారు. దేని కోసం సబ్‌ప్లాన్ నిధులు వినియోగించాలో, దానిని సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. సీఎం అయిన తర్వాత తాను దాన్ని అమలు చేయకుంటే నిలదీయవచ్చని పవన్ సూచించారు.