సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన వెంటనే అతడ్ని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే అప్పటికే అతడు కోమాలో ఉన్నాడు. ఆ వెంటనే అతడ్ని అపోలో హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అరవింద్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. సాయిధరమ్ తేజ్ “ఔట్ ఆఫ్ డేంజర్” అంటూ ఆయన ప్రకటించారు.
ఆ టైమ్ లో వచ్చిన కోమా రూమర్స్ ను మెగా కాంపౌండ్ మూకమ్మడిగా ఖండించింది. సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని మాత్రమే ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వచ్చింది. “మీడియాలో రకరకాల వార్తలు రాకూడదని, అవాస్తవాలు బయటకు వెళ్లకూడదనే ఫ్యామిలీ తరుఫున నేను వచ్చి చెబుతున్నాను” అంటూ ప్రకటించారు అరవింద్.
ఇప్పుడీ అంశంపై స్వయంగా సాయిధరమ్ తేజ్ ప్రకటించాడు. తను 12 రోజుల పాటు కోమాలో ఉన్నట్టు ప్రకటించాడు ఈ హీరో. ఆ టైమ్ లో తనకు భారీగా స్టెరాయిడ్స్ ఇచ్చారని, దాని వల్ల బాగా వెయిట్ తగ్గిపోయానని వెల్లడించాడు. కాస్త బరువుగా ఉండే తను 71 కిలోలకు పడిపోవడం అంటే మామూలు విషయం కాదంటున్నాడు తేజ్.
కోలుకున్న తర్వాత మందుల వల్ల మళ్లీ బరువు పెరిగానని, అలా పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం జిమ్ కు వెళ్లడానికి తన శరీరం ఇంకా సహకరించడం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తనకు శరీరకంగా బాడీని కదపడానికి, మాట్లాడ్డానికి కొంత ఇబ్బందిగా ఉన్న విషయాన్ని తేజ్ అంగీకరించాడు.
అందుకే బ్రో సినిమాలోని జాణవులే సినిమాలో తన బెస్ట్ డాన్స్ ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న తన శారీరక స్థితికి ఆ మాత్రం స్టెప్పులేయడమే చాలా పెద్ద విషయమని, త్వరలోనే అన్ని సమస్యల్ని అధిగమించి మరింత ఫిట్ గా ప్రేక్షకుల ముందుకొస్తానని అంటున్నాడు.