యూత్ లో సాయిపల్లవికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె క్యూట్ స్మైల్ కు కుర్రకారు ఫిదా అయిపోతుంది. మరి సాయిపల్లవికి ఎలాంటి అబ్బాయి నచ్చుతాడు? అబ్బాయిల్లో ఆమె చూసే క్వాలిటీ ఏంటి? దీనికి స్వయంగా సమాధానం చెప్పింది సాయిపల్లవి.
“అబ్బాయిలు ఇలానే ఉండాలనే రూల్ నాకు లేదు. కాకపోతే సెన్సిటివ్ గా ఉండే అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం. వాళ్లు మనస్ఫూర్తిగా ఫీలై ఏదైనా చెబితే ఇష్టం. ఏదైనా ఇష్యూపై వెంటనే స్పందించి ఏడిస్తే నచ్చుతారు. మ్యాచోగా ఉంటే నచ్చదు. అమ్మాయిలు హర్ట్ అవ్వకూడదని అబ్బాయిలు చేసే కొన్ని ప్రయత్నాలు, త్యాగాలు నాకు బాగా నచ్చుతాయి.”
ఇలా తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారో చెప్పేసింది సాయిపల్లవి. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం కోసం చాలామంది కండలు పెంచుతుంటారని, అలా బాడీ పెంచేవారు తనకు నచ్చరని ఓపెన్ గా చెప్పేసింది. అబ్బాయిలు ఫిట్ గా ఉంటే సరిపోతుందని, భారీగా శరీరాన్ని పెంచాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
ఎలా లవ్ ప్రపోజ్ చేస్తే పడిపోతానో కూడా బయటపెట్టింది సాయిపల్లవి. తనకు రోజా పూలు, గోల్డెన్ రింగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. ప్రేమను ప్రపోజ్ చేసినప్పుడు తన మనసుకు నచ్చితే చాలని అంటోంది.