సాయిపల్లవికి సంబంధించి మరో వీడియో లీక్ అయింది. ఇప్పటికే ఆమెకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి అదనంగా ఇంకో వీడియో వచ్చి చేరింది. తాజా వీడియోలో మరింత క్యూట్ గా, ముద్దుగా ఉంది సాయిపల్లవి. శేఖర్ కమ్ముల సినిమాకు సంబంధించిన వ్యవహారం ఇది.
నాగచైతన్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ కోసం హైదరాబాద్ పద్మారావు నగర్ లో రెండు సెట్స్ వేశారు. రోడ్డుకు ఇటువైపు అటువైపు ఉండే ఇళ్ల సెట్స్ అవి.
ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వస్తూ, గేట్ తీసుకొని సాయిపల్లవి ఇంట్లోకి వెళ్లాలి. ఆ సన్నివేశం అత్యంత సహజంగా ఉండాలి. అందుకే జనాలకు కెమెరా కనిపించకుండా, జనాల మధ్యలోంచి నేచురల్ గా సాయిపల్లవి నడిచి వెళ్లే సీన్ ను తీశాడు కమ్ముల.
అయితే పక్కనే రోడ్ సైడ్ హోటల్ లో టిఫిన్ చేస్తున్న వ్యక్తి మాత్రం ఆ సీన్ ను తన కెమెరాలో బంధించాడు. సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
గతంలో విరాటపర్వం సినిమాకు సంబంధించి కూడా ఇలానే సాయిపల్లవి క్లిప్ ఒకటి వైరల్ అయింది. వరంగల్ జిల్లాలోని ఓ బస్టాండ్ లో సాయిపల్లవి కూర్చున్న సీన్ అది. మేకప్ లేకుండా, సాదాసీదా దుస్తుల్లో సాయిపల్లవి అలా కూర్చునేసరికి ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. ఈసారి కూడా దాదాపు అలాంటి సీనే తీశాడు కమ్ముల