సాయిపల్లవి.. వన్ అండ్ ఓన్లీ

ఎక్కడెక్కడి నుంచో వచ్చి తెలుగు సినిమాల్లో నటించి, కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్లు అందుకుంటున్న హీరోయిన్లు అంతా సాయిపల్లవి ని చూసి చాలా నేర్చుకోవాలి. కోటి తీసుకున్నామా, రెండు కోట్లు తీసుకున్నామా? సినిమా షూట్ అయిపోయిందా…

ఎక్కడెక్కడి నుంచో వచ్చి తెలుగు సినిమాల్లో నటించి, కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్లు అందుకుంటున్న హీరోయిన్లు అంతా సాయిపల్లవి ని చూసి చాలా నేర్చుకోవాలి. కోటి తీసుకున్నామా, రెండు కోట్లు తీసుకున్నామా? సినిమా షూట్ అయిపోయిందా అని దులిపేసుకుని చక్కా పోవడం. 

షూటింగ్ జరిగినన్ని రోజులు తమకు, తమ అరడజను సిబ్బందికి సరైన సదుపాయాలు అందాయా లేదా అన్నదే తప్ప సినిమాకు ప్రమోషన్ కూడా చేయాలన్న బాధ్యతే వుండదు. మెజారిటీ హీరోయిన్ల తీరు ఇదే. కానీ సాయి పల్లవి వేరు.

ఆమె నటించిన సినిమాలు అన్నింటికీ నిర్విరామంగా ప్రమోషన్లు చేస్తుంది. కనీసం వారం నుంచి రెండు వారాలు కేవలం ప్రమోషన్ కోసం కేటాయిస్తుంది. అక్కడ కూడా ఇంటర్వూ కి ఓ డ్రెస్ తప్ప మార్చడం లాంటి వ్యవహారాలు వుండవు. ప్రమోషన్ టైమ్ లో కూడా పది మంది సహాయకులు చుట్టూ వుండరు. 

సాయిపల్లవి ఓ సారి ఇంటర్వూకి కూర్చుంటే కనీసం నాలుగైదు అయ్యే వరకు కదలదు. డ్రెస్ చేంజ్ లాంటి మెహర్బానీలు వుండవు. పావుగంటకు ఓసారి టచప్ లు వుండవు. అస్సలు ఒకే ఒక్క అసిస్టెంట్. ఆమే టచప్..ఆమె అన్ని సహాయాలు.

సుధాకర్ చెరుకూరి నిర్మించిన విరాటపర్వం సినిమాకు సాయిపల్లవి 15 రోజులు ఏకంగా ప్రమోషన్ కే కేటాయించింది. లీడింగ్ లో వున్న ఏ హీరోయిన్ ప్రమోషన్ కు ఇన్ని రోజులు కేటాయించడం చాలా అరదు. 

రెండు మూడు గ్రూప్ ఇంటర్వూలు, లేదా రెండు మూడు చానెల్ ఇంటర్వూలు, మహా అయితే ఓ సినిమా ఫంక్షన్..అంతకు మించి అంటే హీరోయిన్లు గిలగిల లాడిపోతారు. కానీ సాయిపల్లవి డిఫరెంట్. ఒక్కటే పీస్..హైబ్రీడ్ పిల్ల.