షార్ట్ గ్యాప్ లో వస్తున్న సాయితేజ్

రీసెంట్ గా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను రిలీజ్ చేశాడు సాయితేజ్. అదే టైమ్ లో దేవకట్టా దర్శకత్వంలో ఓ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఇప్పుడా సినిమా షూటింగ్ 70శాతానికి పైగా…

రీసెంట్ గా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను రిలీజ్ చేశాడు సాయితేజ్. అదే టైమ్ లో దేవకట్టా దర్శకత్వంలో ఓ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఇప్పుడా సినిమా షూటింగ్ 70శాతానికి పైగా పూర్తయింది. దీంతో షార్ట్ గ్యాప్ లో ఈ సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

సాయితేజ్-దేవకట్టా సినిమాకు రిపబ్లిక్ అనే టైటిల్ అనుకుంటున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాతలు భగవాన్-పుల్లారావు సంప్రదింపులు షురూ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫిబ్రవరి నెలాఖరుకు టోటల్ షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మరోవైపు ఏప్రిల్ 30 రిలీజ్ డెడ్ లైన్ ను అందుకునేందుకు డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు.

రిపబ్లిక్ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే, కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు సాయితేజ్. సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈ సినిమాను కూడా ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో.. ఈ ఇయర్ సాయితేజ్ నుంచి 3 సినిమాలు గ్యారెంటీ అన్నమాట.

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

క‌థ మొత్తం బంగారం చూట్టే