దేవర టీమ్ లో ఉత్సాహం వచ్చింది. దీనికి ఓ కారణం ఉంది. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, సర్జరీ నుంచి కోలుకున్నాడు. తను ఫిట్ గా ఉన్నానని, నెలాఖరు నుంచి అందుబాటులోకి వస్తానని యూనిట్ కు సమాచారం అందించాడు. టీమ్ ఆనందానికి ఇదే కారణం.
దేవర పార్ట్-1 ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ కు వాయిదా పడింది. ఇలాంటి టైమ్ లో సైఫ్ అందుబాటులోకి రాకపోతే షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. ఈ టెన్షన్ లో ఉన్న యూనిట్ కు సైఫ్ అలీఖాన్ గుడ్ న్యూస్ అందించాడు.
ఈ నెల నాలుగో వారం నుంచి దేవర సినిమాకు సంబంధించి కీలకమైన భారీ షెడ్యూల్ ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు కొరటాల. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోనే స్టార్ట్ అవుతుంది. సినిమా కోసం వేసిన సెట్స్ తో పాటు, యూనిట్ అంతా సిద్ధంగా ఉంది.
దేవర షూటింగ్ ను వీలైనంత తొందరగా ముగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, వార్-2 సినిమాకు ఎన్టీఆర్ కాల్షీట్లు కేటాయించాడు. అటు జాన్వికపూర్ కూడా చరణ్ తో కలిసి కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. సైఫ్ కు ఆల్రెడీ ఒప్పుకున్న హిందీ సినిమా పెండింగ్ లో ఉండనే ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా అనిరుధ్ రోజురోజుకు బిజీ అవుతున్నాడు.