Advertisement

Advertisement


Home > Movies - Movie News

నా నిర్ణయం త్రివిక్రమ్ కు అస్సలు నచ్చలేదు.. పవన్

నా నిర్ణయం త్రివిక్రమ్ కు అస్సలు నచ్చలేదు.. పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి తన స్నేహితుడు త్రివిక్రమ్ పై స్పందించాడు. పార్టీ పెట్టినప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు తనకు త్రివిక్రమ్ అండగా నిలబడ్డాడని చెప్పుకొచ్చాడు. నిజానికి తను రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్ కు నచ్చలేదని, ఫ్రెండ్ కాబట్టి తనను భరిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

"నేను సమాజం కోసం ఆలోచిస్తే, నాకోసం ఆలోచించేవారు త్రివిక్రమ్. నేను రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్ కు అస్సలు ఇష్టం లేదు. జల్సా ఇంటర్వెల్ సీన్ లో సగటు మనిషి కోపాన్ని చూపించాను. అది త్రివిక్రమ్ ఆలోచన. కనీసం సినిమాల్లోనైనా అలాంటి సీన్లు పెడితే, రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉంటానని అనుకొని త్రివిక్రమ్ ఆ సీన్ పెట్టారు. అయితే ఆ సీన్ తర్వాత నేనింకా పెట్రేగిపోయాను. ఆయనకు అస్సలు ఇష్టం లేదు. తప్పదు కాబట్టి నన్ను భరిస్తూ, నాతో ప్రయాణం సాగిస్తున్నారు."

తను చాలా పారదర్శకంగా వ్యవహరిస్తానని.. తనను దూరం నుంచి చూసే మోదీ లాంటివాళ్లకు ఆ విషయం అర్థమౌతుందని.. తన పక్కనే ఉన్న కొంతమందికి మాత్రం ఆ విషయం అర్థంకావడం లేదన్నారు పవన్. ఏ స్థానంలో ఎవర్ని నిలబెట్టాలో తనకు సలహాలిస్తున్నారని ఎద్దేవా చేశారు.

"దూరం నుంచి నేను చాలా పారదర్శకంగా కనిపిస్తాను. నేను ప్రధాని మోదీకి అర్థమౌతాను, నా అభిమానులకు అర్థమౌతాను. కానీ నాతో పాటు పనిచేసే కొంతమందికి నేను అర్థం కాను. ఎందుకంటే, నా మీద ఆశ వాళ్లకు. ఓ కప్పు కాఫీ ఇచ్చి లేదా ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే అయిపోమంటారు. ఏ నియోజకవర్గంలో ఎవ్వర్ని నిలబెట్టాలో నాకు చెబుతుంటారు."

ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు పవన్. గత ఎన్నికల్లో గాజువాకలో ఓడిపోతానని ముందే తనకు అర్థమైందని.. ఇక భీమవరంలో ప్రచారం ముగించిన వెంటనే ఓడిపోతానని అర్థమైందని అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?