బాబుతో మరోసారి అంటున్న గంటా!

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచే పోటీ చేయాలని ఆయన అనుచర వర్గం ముక్తకంఠంతో చెప్పింది. పక్క జిల్లాకు అసలు వెళ్ళవద్దు అని స్పష్టం చేసింది. చీపురుపల్లి నుంచి పోటీ చేయమంటున్నారు అని…

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచే పోటీ చేయాలని ఆయన అనుచర వర్గం ముక్తకంఠంతో చెప్పింది. పక్క జిల్లాకు అసలు వెళ్ళవద్దు అని స్పష్టం చేసింది. చీపురుపల్లి నుంచి పోటీ చేయమంటున్నారు అని గంటా తన అనుచరుల ముందు విషయం ఉంచి వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు.

విశాఖలో దాదాపుగా నాలుగు గంటల పాటు సాగిన ఈ కీలక సమావేశంలో అనుచరులు అంతా గంటా విశాఖ నుంచే పోటీ చేయాలని నిర్ణయించారు. పాతికేళ్ల పాటు చేసిన గంటా రాజకీయం విశాఖలోనే కొనసాగాలని వారు తీర్మానించారు.

పార్టీ అధినాయకత్వాన్ని మరోసారి దీని మీదనే చెప్పాలని వారు గంటాకు సూచించారు అని అంటున్నారు. గంటా సైతం ఇదే విషయం అధినాయకత్వానికి విన్నవించాలని చూస్తున్నారు. అధినాయకత్వం అయితే గంటా కోర్టులోనే బంతి వేసింది.

చాలా కాలం క్రితమే చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సి ఉంటుందని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. అదే విషయం అప్పట్లో మీడియా సమావేశం పెట్టి మరీ గంటా వెల్లడించారు. ఆ మీదట తాను విశాఖకు 150 కిలోమీటర్లు దూరంగా ఉన్న చీపురుపల్లి వెళ్ళబోను అని కూడా తేల్చి చెప్పారు. ఇపుడు రెండు విడతలుగా అభ్యర్ధుల ప్రకటన వచ్చిన మీదట గంటా సీటు విషయంలో హై కమాండ్ క్లారిటీ ఇవ్వలేదు. చీపురుపల్లి సీటు అలాగే ఉంచింది. అదే విధంగా  భీమిలీ సీటు కూడా ఉంచింది.

దాంతో గంటా వర్గీయులలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని అంటున్నారు. గంటాను భీమిలీ సీటు కోరమని ఈ విషయంలో మరోమారు పరిశీలించమని అంటున్నారు. గంటా ఇదే విషయం హై కమాండ్ కి చెబుతాను అని అంటున్నారు అని తెలుస్తోంది. అప్పటికి కూడా హై కమాండ్ ఏమంటుందో చూడాలని అంటున్నారు.