ఎన్టీఆర్-కొరటాల సినిమా షూటింగ్ ఊపందుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కీలక నటీనటులంతా సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. నిన్నటికినిన్న హీరోయిన్ జాన్వి కపూర్ సెట్స్ లో జాయిన్ అయింది. ఇప్పుడు మరో కీలక పాత్రధారి సైఫ్ అలీఖాన్ కూడా సెట్స్ పైకి వచ్చేశాడు.
ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈరోజు నుంచి అతడు సెట్స్ లో జాయిన్ అయినట్టు యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు సైఫ్-ఎన్టీఆర్-కొరటాల కలిసి దిగిన ఫోటోల్ని విడుదల చేసింది.
ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ఓ సెట్ వేశారు. అందులోనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై వస్తోంది ఈ సినిమా. ఈ సినిమాతో జాన్వికపూర్ టాలీవుడ్ కు పరిచయమౌతోంది. అనిరుధ్ ఇప్పటికే మ్యూజిక్ పనులు మొదలుపెట్టాడు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈసారి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ టైమ్ తీసుకోబోతున్నాడు దర్శకుడు కొరటాల శివ.