‘సాలా’… అచ్చి రాలా!

సాలా… ఓ హిందీ పదం. బావమరిది అన్నది తెలుగు అర్థం మన ఖర్మ కాలి అదో తిట్టు మాదిరిగా తయారు చేసారు దాన్ని. సాలా..సాలా అంటూ మాట్లాడడం నార్త్ బెల్ట్ లో పరమ కామన్…

సాలా… ఓ హిందీ పదం. బావమరిది అన్నది తెలుగు అర్థం మన ఖర్మ కాలి అదో తిట్టు మాదిరిగా తయారు చేసారు దాన్ని. సాలా..సాలా అంటూ మాట్లాడడం నార్త్ బెల్ట్ లో పరమ కామన్ అయిపోయింది. 

అసలే హిందీ స్టయిల్ అంటే మహా ఇష్టం మన పూరి జగన్నాధ్ కు. అందుకే ఆయన తన సినిమాల్లో హిందీ పదాలు, తిట్లు విరివిగా వాడేస్తుంటరు.ఆ కోవ లోనే లైగర్ అనే సినిమా తీసి, ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ తగిలించారు. నిజానికి క్రాస్ బ్రీడ్ అంటే సరిపోతుంది. కానీ ఇలా అయితే బలంగా వుంటుందని ఆ పదం వాడేసారు.

సినిమా విడుదలయింది. అరి వీర డిజాస్టర్ అయింది.

సురేందర్ రెడ్డి హీరో అఖిల్ తో సినిమా ప్రారంభించారు. టైటిల్ ఏజెంట్.  కానీ అక్కడితో ఆగలేదు. దానికి ట్యాగ్ లైన్ కావాల్సి వచ్చింది. వైల్డ్ సాలా అన్న పదం కాయిన్ చేసారు. సాలా నే పవర్ ఫుల్ తిట్టు అనుకుంటే…వైల్డ్ సాలా అన్నది ఇంకా పవర్ ఫుల్ గా వుంటుందని ఆలోచించి వుంటారు.

సినిమా విడుదలయింది. మరో అరివీర డిజాస్టర్ అయింది.

దీన్ని బట్టి అర్థం అవుతోంది ఏమిటంటే, తెలుగు సినిమాలకు సాలా పదం అచ్చిరాదేమో అని. అసలే సెంటిమెంట్ వరల్డ్ టాలీవుడ్.ఇక ఫ్యూచర్ లో ఈ సాలా పదం వాడడానికి బాగా భయం పట్టుకుంటుంది ఇక.