లాక్‌డౌన్ పుణ్యమా అని కరోనా మహమ్మారి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ బందించింది. షూటింగ్‌లు బంద్ కావడం, ఒకవేళ కెమెరాలకు పనిచెబుతున్నా…కరోనా ఎటాక్ అవుతుండడంతో స్వీయ కట్టడి చేసుకోవాల్సి వస్తోంది.
బాలీవుడ్ బిగ్‌స్టార్ సల్మాన్‌ఖాన్ లాక్‌డౌన్ ఖాళీ సమయాన్ని ముంబయ్ సమీపంలోని పన్వెల్ ఫామ్‌హౌస్‌లో గడుపుతున్నాడు. ఫామ్‌హౌస్ సమీప గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తుండడంతో పాటు రైతాంగం పనుల్లో బిజీబిజీగా గడుపు తున్నాడు. తాజాగా తన ట్విటర్ ఖాతాలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న వీడియోను పోస్ట్ చేయడంతో సల్మాన్ రైతు అవతారం ఎత్తిన విషయం వెలుగు చూసింది.
వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ మడిలో ట్రాక్టర్ నడుపుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతుండడం ఆ వీడియోలో చూడొచ్చు. వ్యవసాయం, రైతులంటే తమ హీరోకు ఎంతో ఇష్టమని సల్మాన్‌ఖాన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా లాక్‌డౌన్ విరామ సమయంలో సెలబ్రిటీలు తమకిష్టమైన పనుల్లో నిమగ్నం కావడాన్ని ఇటీవల చూస్తున్నాం.