ఆ ముగ్గురి ‘పెళ్లి సందడి’

దర్శకుడు రాఘవేంద్రరావు కే కాదు, ఇంకా చాలా మందికి పెళ్లి సందడి సినిమా ఓ మంచి జ్ఞాపకం. చిన్న చిన్న విలన్ వేషాలు వేసుకుంటున్న శ్రీకాంత్ ను హీరోగా చేసి, అతని జీవితాన్ని మలుపుతిప్పింది.…

దర్శకుడు రాఘవేంద్రరావు కే కాదు, ఇంకా చాలా మందికి పెళ్లి సందడి సినిమా ఓ మంచి జ్ఞాపకం. చిన్న చిన్న విలన్ వేషాలు వేసుకుంటున్న శ్రీకాంత్ ను హీరోగా చేసి, అతని జీవితాన్ని మలుపుతిప్పింది. నిర్మాతలుగా వ్యవహరించిన అశ్వనీదత్,. అరవింద్ లకు భయంకరమైన లాభాలు వచ్చాయి. ఈ సినిమా తరువాత హీరోయిన్ రవళి చకచకా బోలెడు సినిమాలు చేసింది. అన్నింటికి మించి కీరవాణి పాటలు ఇప్పటికీ జనాలకు మరుపు రాలేదు.

ఇప్పుడు ఈ మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేసే ఆలోచన చేస్తున్నారట దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన చిరకాలంగా ఓ సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. నాగశౌర్యతో సినిమా అన్నారు. ఇద్దరు ముగ్గురు డైరక్టర్లు అన్నారు. అన్నీ మఘలో పుట్టి పుబ్బలో మాడిపోయాయి. ఇప్పుడు ఆఖరికి పెళ్లి సందడి సినిమా ఎలా గైతే కలర్ ఫుల్ గా, మ్యూజికల్ మ్యాజిక్ గా చిన్న సినిమాగా అందించారో, అలాగే ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు.

నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తారు. మళ్లీ కీరవాణి-చంద్రబోస్ ద్వయం పాటలు అందిస్తారు. నటీనటుల విషయం గోప్యంగా వుంచారు. కొద్ది రోజుల్లో బయటకు వస్తుంది. ప్రస్తుతానికి మ్యూజిక్ సిటింగ్స్ మాత్రం ప్రారంభం అయ్యాయి. పెళ్లి సందడి లాంటి పాటలు అందించాలని కేఆర్ఆర్-కీరవాణి-చంద్రబోస్ ల సంకల్పం. చూడాలి మరి ఎలాంటి పాటలు వస్తాయో?

ఆర్జీవీ పవర్ స్టార్ స్పెషల్ ఇంటర్వ్యూ

షకలక శంకర్ డిరా బాబా వెబ్ సిరీస్ ట్రైలర్