సల్మాన్ కు మరోసారి బెదిరింపులు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు వచ్చింది. ముంబయి ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నంబర్ కు ఓ మెసేజ్ వచ్చింది. సల్మాన్ 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే మరణం…

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు వచ్చింది. ముంబయి ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నంబర్ కు ఓ మెసేజ్ వచ్చింది. సల్మాన్ 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే మరణం తప్పదనేది ఆ వాట్సాప్ సందేశం సారాంశం.

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలన్నా, జీవించి ఉండాలన్నా, అర్జెంట్ గా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే బాబా సిద్ధిఖీకి జరిగినట్టే జరుగుతుందని ఆ వాట్సాప్ సందేశంలో హెచ్చరించారు. కొన్ని రోజుల కిందట బాబా సిద్ధిఖీ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

సందేశం వచ్చిన వెంటనే ముంబయి పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సల్మాన్ కు సమాచారం అందించడంతో పాటు, బాంద్రాలోని అతడి ఇంటి వద్ద భద్రతను ఇంకాస్త పెంచారు.

సల్మాన్ కు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో అతడికి పలుమార్లు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఏప్రిల్ లో సల్మాన్ ఇంటిపై కాల్పులు కూడా జరిపారు.

ఆ కాల్పుల ఘటన నుంచే సల్మాన్ పై టార్గెట్స్ ఎక్కువయ్యాయి. బాబా సిద్ధిఖీ హత్య కూడా సల్మాన్ కేంద్రంగానే జరిగినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇదివరకే ప్రకటించింది.

బిష్ణోయ్ భాయ్ తో మాట్లాడాలి..

ఓవైపు సల్మాన్-బిష్ణోయ్ వివాదం నడుస్తున్న టైమ్ లో, ఊహించని విధంగా సోమీ అలీ పేరు తెరపైకొచ్చింది. దీనికి కారణం, ఆమె లారెన్స్ బిష్ణోయ్ కు ఓపెన్ లెటర్ రాయడమే.

“నమస్తే, లారెన్స్ భాయ్. మీరు జైలు నుండి కూడా జూమ్ కాల్స్ చేస్తున్నారని నేను విన్నాను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఎలా సాధ్యమౌతుందో దయచేసి నాకు తెలియజేయండి. ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం రాజస్థాన్. నేను మీ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేయాలనుకుంటున్నాను.”

ఇలా లారెన్స్ బిష్ణోయ్ కు ఓపెన్ లెటర్ రాసింది సోమి. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి ఈమె. గతంలో సల్మాన్ పై ఈమె ఆరోపణలు చేసింది. సల్మాన్ తనను గదిలో బంధించి శారీరకంగా, మానసికంగా హింసించాడని ఆమె ఆరోపించింది.

2 Replies to “సల్మాన్ కు మరోసారి బెదిరింపులు”

  1. “మీరు జైలు నుండి కూడా జూమ్ కాల్స్ చేస్తున్నారని నేను విన్నాను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఎలా సాధ్యమౌతుందో దయచేసి నాకు తెలియజేయండి”

  2. “మీరు జైలు నుండి కూడా జూమ్ కాల్స్ చేస్తున్నారని నేను విన్నాను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఎలా సాధ్యమౌతుందో దయచేసి నాకు తెలియజేయండి”

    with smartphone, with jio sim installed

Comments are closed.