పుష్ప 2 బిజినెస్‌లో అస్సలు వెనక్కు తగ్గడం లేదు. ఏపీ అంతా కలిపి 90 కోట్లు చెబితే అమ్మో అన్నారు. సినిమా విడుదల దగ్గర వచ్చేసరికి రేటు తగ్గిస్తారేమో అనుకున్నారు. కానీ నిర్మాతలు అస్సలు వెనక్కు తగ్గలేదు.
ఏపీ అంతా 90 కోట్ల రేషియో లోనే మార్కెట్ చేసారు. ఒక్క ఉత్తరాంధ్రనే 23 కోట్లు రేటు అన్నమాట. ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించింది అర్అర్అర్, బాహుబలి సిరీస్ మాత్రమే. అలవైకుంఠపురములో సినిమా జీఎస్టీతో కలిపి 21 కోట్లు సాధించింది. అందువల్ల పుష్ప 2 ఈ రికార్డు సాధిస్తే చెప్పుకోతగ్గ విషయమే.
సీడెడ్ ఏరియాను 30 కోట్లకు ఇచ్చారు. నైజాం ఏరియాను మైత్రీ సంస్థ స్వంతంగా పంపిణీ చేసుకుంటుంది. అంటే సుమారుగా 70 కోట్ల మేరకు వాల్యూ అనుకోవాలి. బాహుబలి, అర్అర్అర్ సినిమాలు ఉత్తరాంధ్రకు పంపిణీ చేసిన సాయి కొర్రపాటి వైజాగ్ ఏరియాను కొన్నారు. మిగిలిన ఏరియాలు అన్నీ మైత్రీ సంస్థ రెగ్యులర్ బయ్యర్లే తీసుకున్నారు. సీడెడ్ మాత్రం అభిషేక్ రెడ్డి కొన్నారు.
అల్లు అర్జున్ అత్యంత సన్నిహితుడు బన్నీ వాస్ కృష్ణా జిల్లా పంపిణీ చేస్తున్నారు. యువి అధినేత వంశీ గుంటూరు జిల్లా తీసుకున్నారు.
అర్అర్అర్.. బాహుబలి తప్ప 90 కోట్ల ఫీట్ సాధించలేదు. పుష్ప2 సాధిస్తే అ రికార్డు చరిత్రలో కొన్నాళ్లు పదిలంగా వుంటుంది. టికెట్ రేట్లు, అదనపు అటలు ఇలా ఎంత లాగాలో అంతా లాగడానికి ఏ లోటూ లేదు. అందువల్ల ఇక పుష్ప2 తగ్గేదే లే.
I strongly believe ikapai ye movie nijamgaa 500 cr daatadhu. Kalki laanti movies thappa. Repu raajaa saab koodaa daatadhu. ఒకవేళ దాటింది అని ఎవడైనా పోస్టర్ వేస్తే నవ్వుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు
vc available 9380537747
థియేటర్లో చూసేదే లే