భాయ్ సినిమాను భాయ్ దూజ్ కాపాడాల్సిందే!

సల్మాన్ ఖాన్ సినిమా భారీగా ఓపెన్ అయింది. ఉత్తరాదిన టైగర్-3 సినిమాకు కళ్లుచెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. 2 రోజుల్లో ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇదంతా చూసి సినిమా సూపర్ డూపర్…

సల్మాన్ ఖాన్ సినిమా భారీగా ఓపెన్ అయింది. ఉత్తరాదిన టైగర్-3 సినిమాకు కళ్లుచెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. 2 రోజుల్లో ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇదంతా చూసి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అనుకున్నారు చాలామంది. కానీ ఇది బలుపు కాదు వాపు అనే విషయం మూడో రోజు తేలిపోయింది.

మంగళవారం ఈ సినిమా ఊహించని విధంగా డ్రాప్ అయింది. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 30శాతం డ్రాప్ అయింది. జవాన్, పఠాన్, గదర్2 సినిమాల రికార్డుల్ని ఇది అధిగమిస్తుందని, 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధిస్తుందని అంచనాలతో వచ్చిన ఈ సినిమా, మూడో రోజుకే డ్రాప్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సాధారణంగా వీకెండ్ తర్వాత ఎంత పెద్ద సినిమాకైనా వసూళ్లు తగ్గుతాయి. కానీ టైగర్-3 విషయంలో అలా చెప్పలేం. ఎందుకంటే, ఆదివారం రిలీజైన ఈ సినిమాకు వరుసగా పండగలు కలిసొచ్చాయి. మంగళవారం కూడా గోవర్థన పూజ సందర్భంగా నార్త్ లో పాక్షికంగా హాలిడే ఎఫెక్ట్ కనిపించింది. అయినప్పటికీ వసూళ్లు తగ్గాయి.

టైగర్-3కి ఇక మిగిలింది ఈ ఒక్క రోజు మాత్రమే. ఈరోజు భాయ్ దూజ్. ఉత్తరాదిన చాలా పెద్ద పండగ. సల్మాన్ ఖాన్ సినిమాకు భారీగా వసూళ్లు రావాలంటే ఈరోజు మెరవాల్సిందే. ఇది మిస్సయితే, మళ్లీ వీకెండ్ వరకు ఎదురుచూడాల్సిందే.

జవాన్, పఠాన్ సినిమాల టైపులో టైగర్-3కి ఏకపక్షంగా హిట్ టాక్ రాలేదు. మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాను భాయ్ ఫ్యాన్స్ బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సాధారణ ప్రేక్షకుడు కూడా అదే రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటే, సినిమా హిట్ అయినట్టు.