Advertisement

Advertisement


Home > Movies - Movie News

సెలూన్ వ్యాపారంలోకి సందీప్

సెలూన్ వ్యాపారంలోకి సందీప్

హీరో సందీప్ కిషన్ చకచకా అడుగులు వేస్తున్నాడు. హీరోగా వుంటూనే వివాహ భోజనంబు అంటే హోటల్ చైన్ స్టార్ట్ చేసాడు. హైదరాబాద్, సికిందరాబాద్ ల్లో అవి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. తన స్వంత బ్యానర్ పెట్టి సినిమాలు స్టార్ట్ చేసాడు.

తొలిసినిమా నిను వీడని నీడను నేనే లాభాలు ఇచ్చింది. తెనాలి రామకష్ణ నిర్మాతలకు, బయ్యర్లకు నష్టాలు అయితే ఇవ్వలేదు.  ఇప్పుడు మరో సినిమా తయారవుతోంది. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రులకు బెంజ్ జిఎల్ఈ 350డి కారును ఆయన బహుమతిగా ఇచ్చారు.

ఇలాంటి నేపథ్యంలో లేటెస్ట్ గా మరో వ్యాపారం టేకప్ చేసాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఆయన ఒక సెలూన్ ప్రారంభించనున్నారు. స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నారు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. 

ఒక విధంగా చూసుకుంటే విభజన తరువాత ఆంధ్రలో వ్యాపారం స్టార్ట్ చేసిన హీరో సందీప్ కిషన్ నే అనుకోవాలి. అమరావతి తరువాత ఈ సెలూన్ లను ఆంధ్రలోని పలు ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?