Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ సినిమా కోసం అంత పోటీనా?

ఆ సినిమా కోసం అంత పోటీనా?

ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు ఆ హీరో వెనుక, ఆ డైరక్టర్ వెనుక పరుగులు మొదలవుతాయి. పైగా మంచి డైరక్టర్ అనిపిస్తే చాలు, ఏదో విధంగా తెలుగులోకి లాగేందుకు ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. తమిళ హీరో విజయ్, తమిళ దర్శకుడు లోకేష్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఆ మధ్య వచ్చిన విజయ్ 'విజిల్' సినిమా బాగానే ఆడింది. ఓ పదికోట్ల వసూళ్లు కళ్ల చూసింది. 

తమిళ డైరక్టర్ లోకేష్ అందించిన ఖైదీ సినిమా కూడా తెలుగునాట మంచి పేరు తెచ్చుకుంది. దాంతో ఆ డైరక్టర్ మీద కూడా మన సినిమా జనాల కన్ను పడింది. ఇలాంటి నేపథ్యంలో లోకేష్ తో విజయ్ సినిమా రాబోతోంది. అది కూడా 2020 సమ్మర్ లో. మాంచి స్టార్ కాస్ట్ వుంది. 

దాంతో ఈ సినిమా డబ్బింగ్ హక్కుల కోసం పోటీ మొదలయింది. విజిల్ కొన్న నిర్మాత మహేష్ కోనేరు ఏడున్నర కోట్ల వరకు కోట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రసిద్ద నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కూడా తొలిసారి గా ఓ డబ్బింగ్ సినిమా హక్కుల కోసం ట్రయ్ చేస్తున్నట్లు బోగట్టా. ఈ సంస్థ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇలాంటి నేపథ్యంలో మరో సంస్థ కూడా మరింత ముందుకు వెళ్లి తొమ్మిది కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంకెంతమంది ఈ రేస్ లో ఎంటర్ అవుతారో? రేటు ఎంత పెంచుతారో చూడాలి. ఇక్కడ మరో పాయింట్ ఏమిటంటే, ఈ సినిమా విడుదల డేట్ కే తెలుగులో రామ్ రెడ్ సినిమా కూడా విడుదలవుతోంది. ఆ కాంపిటీషన్ ను కూడా ఈ వేలం పాట పాడుతున్న జనాలు గుర్తు పెట్టుకోవాల్సి వుంది.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?