Advertisement

Advertisement


Home > Movies - Movie News

'రొమాంటిక్' లో గెస్ట్ గా ఆ హీరో

'రొమాంటిక్' లో గెస్ట్ గా ఆ హీరో

ఇస్మార్ట్ శంకర్ తో ట్రాక్ లో వచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్ నిర్మిస్తున్న సినిమా రొమాంటిక్. ఆ సినిమాలో తనయుడు ఆకాష్ పూరి నే హీరో. పూరి కథ, మాటలు అందించి, దర్శకత్వ బాధ్యతలు మాత్రం వేరే కొత్త వ్యక్తి చేతిలో పెట్టారు. ఈ సినిమా షూటింగ్ గోవాలో ఫాస్ట్ గా చేస్తున్నారు.

ఇంతకీ లేటెస్ట్ విషయం ఏమిటంటే, ఈ సినిమాలో గెస్ట్ గా హీరో రామ్ కనిపించబోతున్నారు. ఓ ఆసక్తికరమైన చిన్న పాత్రలో రామ్ నటిస్తున్నాడు. రామ్ కెరీర్ ను ఒక్కసారిగా జంప్ చేయించాడు పూరి జగన్నాధ్. అందుకే ఆ స్నేహంతో రొమాంటిక్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించడానికి రామ్ ఓకె అన్నాడు.

రొమాంటిక్ సినిమా స్టిల్స్ ఇప్పటికే బయటకు వచ్చి, సినిమాకు కాస్త క్రేజ్ తెచ్చాయి. ఇస్మార్ట్ శంకర్ లో మించిన గ్లామర్ డోస్ ను రొమాంటిక్ సినిమాలో పూరి చూపించబోతున్నట్లు ఈ స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పుడు రామ్ నటిస్తున్నాడు అని తెలిస్తే బిజినెస్ బాగానే అవుతుంది.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?