శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సినిమా సామజవరగమన ట్రయిలర్ విడుదలయింది. ఈవారమే వస్తున్న ఈ సినిమా ట్రయిలర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆన్ లైన్ లో విడుదల చేసారు. ఎకె సంస్థ రాజేష్ దండా కలిసి ఈ సినిమాను నిర్మించారు.
శ్రీవిష్ణు కాస్త డిఫరెంట్ కథలు ఎంచుకుంటారు. అవి చిన్న సినిమాలైనా కాస్త వైవిధ్యంగా వుంటాయి. కానీ సామజవరగమన ట్రయిలర్ వరకు చూసుకుంటే వైవిధ్యమైన పాయింట్ కనిపించలేదు. ఇదే సినిమా టీజర్ లోనే వెరైటీ పాయింట్ చూపించేసారు. ఐ లవ్ యు అన్న వారందరికీ హీరో రాఖీ కట్టేయడం. అది కొత్త పాయింట్. బహుశా అక్కడ ఈ పాయింట్ చూపించేసామనే ఉద్దేశంతో కావచ్చు, ట్రయిలర్ వేరే విధంగా కట్ చేసారు.
పక్కా ఫ్యామిలీ స్టోరీ, బోలెడు మంది ఆర్టిస్టులు, హీరో, హీరోయిన్ టీజింగ్, ఇలా ఫక్తు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫన్ స్టోరీ అనే కలర్ ను ట్రయిలర్ ఇచ్చింది. ఈసారి శ్రీవిష్ణు టిపికల్ పాయింట్లు ఏవీ తీసుకోలేదు. హాయిగా అందరికీ నచ్చేసే, అందరూ చూసేసే ఫ్యామిలీ సబ్జెక్ట్ ను తీసుకున్నాడని అర్థం అవుతోంది.
ట్రయిలర్ లో వెన్నెల కిషోర్ మెరుపులా మెరిసాడు. సీనియర్ నటుడు నరేష్ ఫన్ బాగా పండిస్తారు. సినిమాలో హీరో తరువాత ఆయన కూడా ఫుల్ ఫన్ పండించినట్లు కనిపిస్తోంది. సామజవరగమన అనే టైటిల్ కు సినిమాతో ఏ మేరకు సంబంధం వుంటుంది అన్నది పక్కన పెడితే ఓ ఫీల్ గుడ్ సినిమా అనే లుక్ ను అయితే తీసుకవచ్చింది.
రెబా మోనికా హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాకు సంగీతం గోపీసుందర్. టెక్నికల్ కాస్ట్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. టయిలర్ కలర్ ఫుల్ గానే వుంది.