ముద్దుగుమ్మ, అక్కినేని వారి కోడలు సమంతపై నెటిజన్లు జాలి చూపుతున్నారు. అంత కష్టం వద్దమ్మా అంటూ కామెంట్ప్ పెడుతున్నారు. దీనంతటికి కారణం తన ఆరోగ్యం కోసం ఆమె ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడమే.
అందానికి మారుపేరు సమంత అక్కినేని. తన అందచందాలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆమె ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెడుతుంటారు.
కొంత కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగని కెమెరాకు ఆమె దూరంగా ఉండడం లేదు. ఇటీవల బిగ్‌బాస్ షోలో తన మామ నాగార్జున ప్లేస్‌లో హోస్ట్‌గా అదరగొట్టారనే పేరు తెచ్చుకున్నారు.
సినిమాలకు కాస్తా విరామం ఇచ్చి వెబ్ సిరీస్, డిజిటల్ మీడియాకు దగ్గరవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా అల్లు అరవింద్ ఆహాలో స్యామ్ జామ్ అనే టాక్ షో కూడా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదే సమయంలో ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం గంటల తరబడి ఆమె జిమ్‌లో గడుపుతున్నారు. తాజాగా ప్లాంట్ బేస్డ్ డైట్, వర్కవుట్స్‌ను సమంత ప్రారంభించారు. సంబంధిత వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఆ వీడియోకు 5.81 లక్షలకు పైగా లైక్స్ రావడం చూస్తే ….సమంతపై అభిమానం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు అద్భుతమని కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎందుకమ్మా అంత కష్టమంటూ సానుభూతి చూపుతున్నారు.
ఇటీవల 110 కేజీల బరువులు ఎత్తి ఔరా అనిపించారు. కాగా స్యామ్ జామ్ అనే టాక్ షోతో పాటు ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌ను సమంత చేస్తున్నారు. అంతేకాదు, మంచి కథలు వస్తే సినిమాలు కూడా చేయడానికి సిద్ధమంటున్నారామె.