మానవ వర్ణనకు అందనివిలా ఉన్న ఎన్నో అందాలకు, ఆశ్చర్యాలకు ఒక ఆకృతిని కల్పించిన పెయింటర్ రాజా రవివర్మ. శిల్పకళకే పరిమితం అయిన ఎన్నో అందాలను, ఆకృతులకు వన్నెచిన్నెల రూపాన్ని ఇచ్చిన మహా కళాకారుడు రాజా రవివర్మ. అలాంటి రవివర్మ కళాఖండాలను రీ క్రియేట్ చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. రవి వర్మ అందాలకు తీసిపోని రీతిలో ఉన్న హీరోయిన్లతో ఆ పెయింటింగ్ లకు ధీటైన పోజులు ఇప్పించి, ఫొటోలుగా ఈ అందాలను ఒడిసిపట్టారు.
అలాంటిదీ పై చిత్రం. తన అధికారిక ఇన్ స్టాగ్రమ్ అకౌంట్లో సమంత ఈ పిక్స్ పోస్ట్ చేసింది. కేవలం సమంత మాత్రమే కాదు, శృతి హాసన్, ఖుష్బూ, రమ్యకృష్ణ తదితరులతో కూడా రవివర్మ చిత్రాలను ఫొటోలుగా రీ క్రియేట్ చేసే ఈ ప్రయత్నాలు జరిగాయి.
అయితే వారందరిలో కెళ్లా.. సమంతే ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంది. ఈ రాయల్ లుక్ లో సమంత అందం అనేక రెట్లు పెరిగిందని అనడంలో ఆశ్చర్యం లేదు. అదే సమయంలో రవివర్మ పెయింటింగ్ కు కూడా ఆమె బాగా న్యాయం చేస్తున్నట్టుగా కనిపించింది. ఆ పెయింటింగ్ కే పోటీ అనేంత స్థాయి పోజును ఇచ్చింది!