రైటర్లు మామూలుగా పాటలు సిట్యువేషన్ బట్టి, డైరక్టర్ చెప్పిన దాన్ని బట్టి రాస్తారు. హీరో బ్యాక్ గ్రవుండ్, ఇమేజ్ ఒక్కోసారి పాటల్లోకి వస్తుంటుంది.
లేటెస్ట్ గా చంద్రబోస్ రాసిన సమంత పాట కేవలం సినిమాలో ఐటమ్ సాంగ్ మాదిరిగా మాత్రమే కాకుండా చాలా విషయాలు చొప్పించి మరీ రాసినట్లు అనిపిస్తుంది.
అక్కడ సమంత లేకుంటే ఇంత రంధ్రాన్వేషణ వుండేది కాదు. కానీ సమంత వుండడంతో, పాటలో అర్థాలకు నానార్ధాలు కనిపిస్తున్నాయి.
మగవారి నైజం ఇదీ అంటూ సాగింది రచన. సమంత జీవితంలో ఇప్పటికి రెండు సార్లు ఎదురుదెబ్బలు తింది. రెండు సార్లు మగవారి కారణంగానే. అందువల్ల మగవారి మీద సహజంగానే కాస్త చులకన భావం వుంటుంది. ఆ ఊహే పాటలోకి చేరిందేమో?
సమంత డ్రెస్ లు, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తరచు పెట్టడం వంటివి చైతూకి ఇష్టం లేదని గ్యాసిప్ లు వున్నాయి. ఇక్కడ డ్రెస్ లు కీలకం కాదు. మగ బుద్దే అంత అన్నది పాటలో చేరిందేమో?
సమంత తనకు పెళ్లయిన దగ్గర నుంచి నాగ్ ను మామా..మామా అనడం అలవాటు చేసుకున్నారు. నిజానికి తెలుగు జనాలు భర్త తండ్రిని మామగారు లేదా మావయ్యా అంటారు కానీ మామా అనడం తక్కువ. కొన్ని చోట్ల మాత్రమే ఈ పలుకుబడి వుంది. ఈ మామా..మామా..కాస్తా మావా..మావా గా మారి, ప్రశ్నలు నాగ్ కే సంధించేటట్లు చేరాయేమో?
మొత్తం మీద పుష్పలో ముందుగా వచ్చి హిట్ అయిన పాటలు అన్నింటినీ పక్కకు తోసేసింది..ఊ అంటారా..మావా అన్న సాంగ్. ముఖ్యంగా సమంత ఆ పాట చేయడం వల్ల ఎక్కడికో వెళ్లిపోయింది.