Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లిపై స‌మంత అదిరిపోయే పోస్ట్‌

పెళ్లిపై స‌మంత అదిరిపోయే పోస్ట్‌

నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత సమంత ప్ర‌తి క‌ద‌లిక వార్తాంశ‌మ‌వుతోంది. స్టార్ హీరోయిన్ అయిన స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్‌. నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్‌లు వైర‌ల్ అవుతున్నాయి. త‌న జీవిత నేప‌థ్యానికి త‌గ్గ‌ట్టు ఆ పోస్ట్‌లు వుండ‌డ‌మే కార‌ణం.

మై మామ్‌ సెడ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ప్రస్తుతం తన అనుభ‌వాల‌ను లోకంతో పంచుకునే ఆమె ప్ర‌య‌త్నాలు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో అమ్మాయి పెళ్లిపై కొన్ని సూచ‌న‌లు చేస్తూ పెట్టిన పోస్ట్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

‘మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారాని కంగారు పడకుండా తనని సమర్థంగా తీర్చిదిద్దండి. తన పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు తన చదువుకు ఖర్చు పెట్టండి. ఆమెను పెళ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యం. అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించండి. అలాగే ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి’ అనే పోస్ట్‌ను షేర్‌ చేశారామె.

ఈ పోస్ట్‌లో అర్థం చేసుకునే వాళ్ల‌కు ఎంతైనా విష‌యం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా ఆడ‌పిల్ల అన‌గానే పెళ్లి చేసి పంపితే బాధ్య‌త తీరిపోతుంద‌నే ఆలోచ‌న‌తో పెంచే స‌మాజంలో స‌మంత పోస్ట్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆడ‌పిల్ల‌కు అన్నిటికంటే చ‌దువే ముఖ్య‌మ‌నే సందేశాన్ని త‌న పోస్ట్ ద్వారా ఆమె పంపారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?