సమంత రెండో పెళ్లి చేసుకుందా?

మెడలో చిన్న నల్లపూసల దండ. దానికి కాస్త దిగువన ఓ పెద్ద పసుపు తాడు. సమంత కొత్త అవతారం ఇది. దీంతో ఆమె పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో ఒకటే దుమారం. కొత్తగా పెళ్లయిన…

మెడలో చిన్న నల్లపూసల దండ. దానికి కాస్త దిగువన ఓ పెద్ద పసుపు తాడు. సమంత కొత్త అవతారం ఇది. దీంతో ఆమె పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో ఒకటే దుమారం. కొత్తగా పెళ్లయిన మహిళల మెడలోనే పసుపు తాడు ఉంటుంది కాబట్టి, సమంత రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకుందంటూ ఒకటే హంగామా.

ఇంతకీ ఏం జరిగింది..

నిజానికి సమంత రెండో పెళ్లి చేసుకోలేదు. ఓ సినిమా షూటింగ్ కోసం ఆమె అలా తయరైంది. రీసెంట్ గా ఖుషి సినిమా సెట్స్ లోకి జాయిన్ అయింది ఈ బ్యూటీ. ఇందులో ఓ సీన్ కోసం ఆమె మెడలో నల్లపూసలు, పసుపుతాడు వేసుకుంది. బహుశా, సినిమాలో అది ఓ పెళ్లి సీన్ కు సంబంధించిన సెటప్ అయి ఉండొచ్చు.

దాని కోసం సమంత ముస్తాబవ్వగా, సెట్ లో ఎవరో దాన్ని క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో సమంత రెండో పెళ్లి చేసుకుందంటూ నానా హడావుడి జరిగింది. నిజానికి ఖుషి సినిమా కోసం ఆమె గెటప్ అది.

అసలు పెళ్లి ఆలోచన లేదు..

నాగచైతన్యతో వివాహబంధానికి గుడ్ బై చెప్పేసిన సమంత, అప్పట్నుంచి సింగిల్ గానే ఉంటోంది. పూర్తిగా సినిమాలపై దృష్టి సారించింది. కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటోంది. ఓవైపు ఆ ఆలోచనలో ఉంటుండగానే, మరోవైపు అనారోగ్యం బారినపడింది. దాన్నుంచి కోలుకోవడానికి ఆమె చాలా సమయం పట్టింది. ఇలా వరుసపెట్టి ఇటు సినిమాలు చేయడంతో పాటు, అటు ఆరోగ్యాన్ని కాపాడుకునే పనిలో సమంత బిజీగా ఉంది. ప్రస్తుతానికి ఆమెకు ఎలాంటి పెళ్లి ఆలోచనలు లేవు.

శాకుంతలం కోసం ప్రత్యేక పూజలు..

సమంత నుంచి త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం సినిమా ఆధారంగా, గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్రచారాన్ని ఈరోజు నుంచి అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ ప్రచారం ప్రారంభించారు. 

హీరోయిన్ సమంత, హీరో దేవ్ మోహన్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శకుడు గుణశేఖర్, నిర్మాత నీలిమ గుణ, దిల్ రాజు కుమార్తె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది శాకుంతలం సినిమా.