తనపై వస్తున్న పుకార్లను ఎంజాయ్ చేస్తున్న సమంత

పుకార్లపై స్పందించే విషయంలో ఒక్కో సెలబ్రిటీ ఒక్కో రకంగా వ్యవహరిస్తుంటారు. పుకార్లు ఇలా మొదలవ్వగానే అలా వాటిపై స్పందించి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారు కొంతమంది. మరికొంతమంది మాత్రం తమపై వచ్చిన పుకార్లను…

పుకార్లపై స్పందించే విషయంలో ఒక్కో సెలబ్రిటీ ఒక్కో రకంగా వ్యవహరిస్తుంటారు. పుకార్లు ఇలా మొదలవ్వగానే అలా వాటిపై స్పందించి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారు కొంతమంది. మరికొంతమంది మాత్రం తమపై వచ్చిన పుకార్లను ఎంజాయ్ చేస్తుంటారు. బహుశా, హీరోయిన్ సమంత ఈ రెండో టైపు అనుకోవచ్చు.

ఎన్నడూలేని విధంగా తన వ్యక్తిగత జీవితంపై పుకార్లు ఎదుర్కొంటోంది సమంత. భర్త నాగచైతన్యతో ఆమె కాపురం సజావుగా సాగడం లేదనేది ఆ రూమర్. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడం ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చినట్టయింది. 

ఈ ఊహాగానాలు ఎలా మొదలయ్యాయి, ఏ టర్న్ తీసుకున్నాయనే విషయాన్ని పక్కనపెడితే.. ఇది చాలా సున్నితమైన అంశం. ఎక్కువసేపు అలా నాన్చడం మంచిది కాదు. కానీ సమంత మాత్రం నాన్చడానికే మొగ్గుచూపుతోంది. తనకేం సంబంధం లేనట్టే వ్యవహరిస్తోంది.

ఓవైపు ఆమె వైవాహిక జీవితంపై ఇన్ని రూమర్లు వస్తుంటే, మరోవైపు సమంత మాన్ సూన్ సీజన్ ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించి ఆమె ఫొటోలు కూడా పోస్ట్ చేస్తోంది. మరోవైపు తన ఇనస్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ సైకాలజిస్ట్ చెప్పిన కొటేషన్ ను షేర్ చేసిన సమంత.. పుకార్లను పట్టించుకోవద్దు అనే విధంగా రియాక్ట్ అయింది. సో.. ఆమె తనపై వస్తున్న పుకార్లపై స్పందించకూడదనే నిర్ణయించుకుంది.