సమంత… నాగచైతన్యతో విడాకుల తర్వాత వార్తల్లో వ్యక్తిగా నిలిచారామె. గతంలో నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఆమె గురించి చర్చ జరిగేది. కానీ వివాహ బంధం విచ్ఛిన్నం కావడంతో ఆమె వృత్తిగత జీవితం కంటే వ్యక్తిగత జీవితంపైన్నే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ చర్చ ఆపండ్రా బాబూ అని ఆమె వేడుకుంటున్నా పట్టించుకునే వాళ్లే కరువయ్యారు.
తాజాగా సమంత సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ పోస్టులో స్నేహం, ప్రేమ తదితర ముఖ్య విషయాలకు చోటు దక్కడంతో సహజంగానే సమంత గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. తాజాగా సమంత తన ఫ్రెండ్ డాక్టర్ మంజుల అనగాని పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు.
సమంతతో పాటు మహిళా దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఉన్నారు. స్నేహితురాలి పుట్టిన రోజు పురస్కరించుకుని, ఆమె గొప్పదనాన్ని ఆవిష్కరించారు. మంజుల గురించి సమంత పెట్టిన ఆసక్తికర పోస్ట్ ఏంటంటే…
“నీలాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణంగా భావిస్తున్నా. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే”అని పోస్ట్ పెట్టారామె.
నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఎక్కువగా స్నేహితులతోనే గడుపుతున్న సంగతి తెలిసిందే. బహుశా విడాకుల తర్వాత ఆమె జీవితంలో ఎదురైన కష్ట సమయంలో మంజుల అండగా నిలిచారేమోనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.