సమంత.. త్వరలోనే బాలీవుడ్ మూవీ కూడా?

పనిలో పడిపోతే బాధల్ని మరిచిపోతానంటూ గతంలోనే ఓసారి ప్రకటించిన సమంత, ఇప్పుడు అదే పనిలో ఉంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత మరోసారి సినిమాలతో బిజీ అయిపోవాలని నిర్ణయించింది.  Advertisement ఇప్పటికే సౌత్ లో రెండు…

పనిలో పడిపోతే బాధల్ని మరిచిపోతానంటూ గతంలోనే ఓసారి ప్రకటించిన సమంత, ఇప్పుడు అదే పనిలో ఉంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత మరోసారి సినిమాలతో బిజీ అయిపోవాలని నిర్ణయించింది. 

ఇప్పటికే సౌత్ లో రెండు సినిమాలు ప్రకటించింది. ఇప్పుడు ఓ బాలీవుడ్ ప్రాజెక్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో నెల రోజుల్లో ఆ బాలీవుడ్ ప్రాజెక్టు వివరాలు బయటకొస్తాయి.

ఫ్యామిలీ మేన్ సీజన్-2తో బాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకుంది సమంత. ఆ వెంటనే ఆమెకు కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. ఫ్యామిలీ మేన్-2 స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత తనకు 2 హిందీ సినిమా ఆఫర్లు వచ్చాయని సమంత ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అయితే వాటిని తిరస్కరించినట్టు కూడా 
తెలిపింది.

సౌత్ లో ఆమె ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది. గ్లామర్ రోల్స్ ఆపేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో సమంత ఎలాంటి రోల్స్ ఎంచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, గ్లామర్ రోల్స్ తో పాటు..ఫిమేల్ సబ్జెక్ట్స్ చేయడానికి కూడా అక్కడ చాలామంది ఉన్నారు.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా ఎనౌన్స్ చేసింది సమంత. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై మరో సినిమా ప్రకటించింది. తెలుగు-తమిళ భాషల్లో రాబోతున్న ఈ రెండు సినిమాలతో కొత్త దర్శకుల్ని పరిచయం చేయబోతోంది. 

నెల రోజుల గ్యాప్ లో ఈ రెండూ సెట్స్ పైకి  రాబోతున్నాయి. దాదాపు అదే టైమ్ లో తన బాలీవుడ్ వెంచర్ ను కూడా ప్రకటించే ఆలోచనలో ఉంది సమంత.