సమంత.. ఈరోజు నుంచి ఫుల్ ఫ్రీ

ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయితే నటీనటుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ యూనిట్ ను మిస్ అవుతున్నానని, మరపురాని రోజులని, మరోసారి అదే టీమ్ తో కలిసి పనిచేయాలని ఉందంటూ స్పందిస్తుంటారు.…

ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయితే నటీనటుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ యూనిట్ ను మిస్ అవుతున్నానని, మరపురాని రోజులని, మరోసారి అదే టీమ్ తో కలిసి పనిచేయాలని ఉందంటూ స్పందిస్తుంటారు. కానీ సమంత మాత్రం షూట్ పూర్తయిన సందర్భంగా ఊపిరి పీల్చుకుంది.

ఇవాళ్టితో సిటాడెల్ షూటింగ్ పూర్తిచేసుకుంది సమంత. ఈ సందర్భంగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. “జులై 13 ఎల్లప్పుడూ ప్రత్యేకమైన రోజు, సిటాడెల్ పూర్తయింది.” అంటూ స్పందించింది.

ఈ వెబ్ డ్రామా కోసం సమంత చాలా కష్టపడింది. ఈ షూటింగ్ లోనే ఆమె గాయల బారిన కూడా పడింది. చాలా కష్టంతో కూడుకున్న ఈ ఓటీటీ కంటెంట్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ఇలా పోస్టు పెట్టిందని కొంతమంది చెప్పుకొచ్చారు.

సమంత సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతోందనే ప్రచారం కొన్ని రోజులుగా నడుస్తోంది. ఓ ఏడాది పాటు గ్యాప్ తీసుకొని, శారీరకంగా ఫిట్ గా తయారవ్వాలని ఆమె అనుకుంటోందట. మయోసైటిస్ నుంచి ఆమె కోలుకున్నప్పటికీ, మరింత దృఢంగా మారేందుకు ఆమె ప్రొఫెషన్ నుంచి ఏడాది గ్యాప్ తీసుకొని, అమెరికా వెళ్లాలని అనుకుంటోందట.

దీని కోసమే ఆమె తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తిచేసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఈమధ్య ఖుషి సినిమా షూట్ పూర్తిచేసింది. ఇప్పుడు సిటాడెల్ కూడా కంప్లీట్ చేసింది. ఈ ఆనందంలోనే ఆమె ఇలా స్పందించి ఉంటుందనేది మరికొందరి మాట.

ఏదేమైనా సమంత ఇవాళ్టి నుంచి ఫ్రీ అయిపోయింది. ఆమె చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు.