టీడీపీతో బీజేపీ పొత్తు ప్రకటించిన చంద్రబాబు ఆప్తమిత్రుడు!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీ- జ‌న‌సేన‌- టీడీపీ పొత్తు ఉంటుంద‌ని సృష్టం చేశారు మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి. పొత్తుల‌పై ఇప్ప‌టికే ఢిల్లీ హైకమాండ్ నుండి సృష్ట‌మైన సంకేతాలు వ‌చ్చాయ‌ని కూడా సెల‌విచ్చారు. అటు…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీ- జ‌న‌సేన‌- టీడీపీ పొత్తు ఉంటుంద‌ని సృష్టం చేశారు మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి. పొత్తుల‌పై ఇప్ప‌టికే ఢిల్లీ హైకమాండ్ నుండి సృష్ట‌మైన సంకేతాలు వ‌చ్చాయ‌ని కూడా సెల‌విచ్చారు. అటు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి మాత్రం పొత్తుల‌పై అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెబుతున్నా.. టీడీపీ పార్టీ అంటే అతి ప్రేమ ఉన్న అదినారాయ‌ణ రెడ్డి మాత్రం పార్టీలో ఏ అధికార హోదాలో ప్ర‌క‌టించారో ఆయ‌న‌కే తెలియాలి.

నిన్న‌టి నిన్న కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌యోజ‌న‌ల కోసం అలోచిస్తామ‌ని.. ఎవ‌రో చెప్పిన దాని గురించి మాట్లాడుకోవ‌డం వేస్ట్ అనేలాగా మాట్లాడారు. ఇవాళ అదినారాయ‌ణ రెడ్డి మరో సారి పొత్తుల‌పై ప్ర‌క‌ట‌నం చేయ‌డం విశేషం. మ‌రోవైపు అసెంబ్లీ ఎన్నికల్లోగా.. టీడీపీతో పొత్తు కుదరకపోతే ఆయన తిరిగి టీడీపీలో చేరుతారని కూడా ఒక ప్రచారం ఉంది.  

కాగా 2014లో వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి జంప్ అయిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. అసెంబ్లీ వేదిక‌గా, అలాగే వెలుప‌ల జ‌గ‌న్‌పై అవాకులు చెవాకులు పేలారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఏం చేస్తారోన‌నే భ‌యంతో బీజేపీ పంచ‌న‌ చేరారు. అయితే బీజేపీని బ‌లోపేతం చేయ‌డం ప‌క్క‌న పెట్టి టీడీపీ వాయిస్‌ను వినిపిస్తున్నారు.

ఇప్ప‌టికే బీజేపీలోని ఒక వ‌ర్గం చంద్ర‌బాబుతో పొత్తు వ‌ద్దంటుంటే.. మ‌రో వ‌ర్గం మాత్రం టీడీపీతో పొత్తు కావాలంటున్నారు. ఏది ఏమైనా బీజేపీలోని చంద్ర‌బాబు వ‌ర్గం నేత‌లు మాత్రం పొత్తులు లేక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీలో చేరి ఆ పార్టీ నుండే పోటీ చేసే అవ‌కాశం లేక‌పోలేదు.