సమంత బాధ తీరుస్తున్న గుణశేఖర్

కెరీర్ లో ఎన్నో పాత్రలు పోషించింది. ఫ్యామిలీ మేన్ సిరీస్ లో విలన్ గా కూడా నటించింది. కానీ ఓ మైథలాజికల్ పాత్ర పోషించలేకపోయాననే బాధ సమంతకు అలా మనసులో ఉండిపోయింది. ఇన్నాళ్లకు తన…

కెరీర్ లో ఎన్నో పాత్రలు పోషించింది. ఫ్యామిలీ మేన్ సిరీస్ లో విలన్ గా కూడా నటించింది. కానీ ఓ మైథలాజికల్ పాత్ర పోషించలేకపోయాననే బాధ సమంతకు అలా మనసులో ఉండిపోయింది. ఇన్నాళ్లకు తన బాధను గుణశేఖర్ తీరుస్తున్నాడని చెప్పుకొచ్చింది సమంత.

“నాకు ఎప్పుడూ చిన్న బాధ ఉండేది. మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇంకా చేయలేదని అనిపిస్తుంది. 50 సినిమాలు చేశాను. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ ఇలా చాలా పాత్రలు చేశాను. కానీ నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి నా డ్రీమ్ రోల్ ఏంటని అడిగితే ఓ పీరియడ్ ఫిలిం, ప్రిన్సెస్ రోల్ అని చెబుతూ వస్తున్నాను. ఇన్నాళ్లకు గుణశేఖర్, దిల్ రాజు వల్ల నా కల నెరవేరుతుంది. వాళ్లు నాకిచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇది.”

ఈరోజు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా లాంఛ్ అయింది. ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళలం నటుడు దేవ్ కనిపించబోతున్నారు. కచ్చితంగా ఇది తన రేంజ్ బడ్జెట్ సినిమా కాదంటోంది సమంత.

భారీ బడ్జెట్ తో రాబోతున్న శాకుంతలం ప్రాజెక్టులోకి దిల్ రాజు కూడా ఎంటరయ్యారు. 4 నెలల నుంచి సినిమాకు సంబంధించి సెట్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది శాకుంతలం సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. సినిమాలకు  గుడ్ బై చెప్పేస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో.. లాంగ్ గ్యాప్ తర్వాత సమంత ఓకే చేసిన ప్రాజెక్టు ఇది.

Click Here For Photo Gallery

ఇంత మాస్ క్యారెక్ట‌ర్ నా కెరియ‌ర్ లో ఎప్పుడు చేయ‌లేదు

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు