సంక్రాంతి బరిలో దిగడానికి భీమ్లా నాయక్ రెడీ అయిపోతోంది. ఈ మేరకు అనుమానాలు తీరిపోయాయి. డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ లు చేసి థియేటర్లు రెడీ చేసుకోమని నిర్మాత నాగవంశీ చెప్పేసారు.
వైజాగ్ మినహా మిగిలిన ఏరియాలు అన్నింటికీ బయ్యర్లు ఫిక్స్ అయిపోయారు. వైజాగ్ మాత్రం దిల్ రాజు నా, వీర్రాజునా అన్నది తేలాల్సి వుంది.
ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ మూడూ సంక్రాంతికి విడుదలయితే థియేటర్ల సమస్య వస్తుంది. పైగా ఎంత కాదన్నా రెవెన్యూ కూడా షేర్ అవుతుంది. కానీ తప్పని సరి పరిస్థితి. నిజానికి భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ముందుగానే డేట్ లు ప్రకటించాయి. కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం మధ్యలో వచ్చి దూరింది.
ఎప్పుడయితే ఆర్ఆర్ఆర్ చేసింది కరెక్ట్ కాదు అని అనలేరో? భీమ్లా నాయక్ ను రావద్దని అనలేరు. పైగా పండగ బరిలో దిగుతాం అని ముందుగా చెప్పి, ఇప్పుడు రాకుంటే ఎలా అనే హీరో పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.