రోడ్డు ప్రమాదం: తృటిలో తప్పించుకున్న సంపూ

నటుడు సంపూర్ణేష్ బాబు ఓ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ఆర్టీసీ బస్సు, సంపూర్ణేష్ కారును దారుణంగా ఢీకొట్టింది. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద…

నటుడు సంపూర్ణేష్ బాబు ఓ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ఆర్టీసీ బస్సు, సంపూర్ణేష్ కారును దారుణంగా ఢీకొట్టింది. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్నాడు సంపూ. అతడితో పాటు ఆయన భార్య, కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు వెళ్లి ప్రధమ చికిత్స తీసుకున్నారు. ఈ ప్రమాదంలో సంపూ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా డ్యామేజీ అయింది. 

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు కారణమౌతున్నాయి. అసలైన డ్రైవర్లను ఇంకా విధుల్లోకి తీసుకోకపోవడంతో.. తాత్కాలిక డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. నిన్నటికినిన్న హైదరాబాద్ లో ఓ మహిళా ఉద్యోగిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాద వార్తను ప్రజలింకా మరిచిపోకముందే,  ఇప్పుడు మరో ఆర్టీసీ బస్సు సంపూర్ణేష్ కారును ఢీకొట్టింది.