కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రీ కొడుకులకు అంకింతం అని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. తన సినిమా విషయమై ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
సినిమాలో పవన్ కళ్యాణ్ ను పోలిన ఓ పాత్ర , ఆ పాత్ర పెట్టే 'మనసేన' అనే పార్టీ వుంటుందని అన్నారు. జనసేనకు మనసేనకు సంబంధం లేదని మీడియా మీద ఒట్టేసి చెబుతున్నా అన్నారు.
తన కెరీర్ లో తొలిసారి తాను తీసిన మెసేజ్ ఓరింయెంటెడ్ సినిమా ఇది అని ఆర్జీవీ అన్నారు. తన సినిమాలకు కోర్టులకు వెళ్లడం కామన్ అయిపోయిందని ఆయన చమత్కరించారు. 2019 నుంచి 2020 మధ్యకాలంలో జరిగింది అనే కథను ఊహించి ఈ సినిమా చేసా అన్నారు.
సినిమాలో బాలకృష్ణ పాత్ర లేదన్నారు. తను ఏ కులాన్ని ఎక్కువ, తక్కువ చేయడం లేదన్నారు. గతంలో జరిగినవి సినిమాలుగా తీసానని, ఇప్పుడు జరుగుతుందని భావించినవి సినిమాగా తీసానని అన్నారు. ఇది ఒక పొలిటికల్ సెటైర్ మాత్రమే అన్నారు.
సినిమాలో వున్న పాత్రలు అన్నీ కల్పితం, పాత్రలు-నిజ జీవిత పాత్రలకు మధ్య పోలికలు యాధృచ్చికం అని ఆయన అన్నారు. ఇది తప్పు అని అంటే బాలాజీ తనను శిక్షిస్తాడని ఆయన చెప్పారు.
పప్పు సీన్ ట్రయిలర్ లో చూసి చాలా మంది తెలుగుదేశం నాయకులే తనకు ఫోన్ చేసి అభినందించారని అన్నారు. బహుశా వాళ్లు పీల్ అయి, చెప్పలేకపోయినది తాను చెప్పానని అలా చేసి వుంటారని అన్నారు. తన సినిమా మాంచి వింధు భోజనం లాంటిది అని అందుకోసమే చూడాలని ఆర్జీవీ అన్నారు.