సంసారపక్షమైన ‘వరుడు కావలెను’

ఈ రోజుల్లో మా సినిమా యూత్ ఫిలిం..పైకి అలా వుంది కానీ, లోపల థియేటర్లో వేరే వుంటుంది అని నిర్మాతలు చెప్పుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే అలా కాకపోతే జనాలకు నచ్చడం లేదు.  Advertisement నాగశౌర్య-రీతూవర్మ…

ఈ రోజుల్లో మా సినిమా యూత్ ఫిలిం..పైకి అలా వుంది కానీ, లోపల థియేటర్లో వేరే వుంటుంది అని నిర్మాతలు చెప్పుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే అలా కాకపోతే జనాలకు నచ్చడం లేదు. 

నాగశౌర్య-రీతూవర్మ నటించిన వరుడు కావలెను సినిమా ట్రయిలర్ విడుదల సభలో మేకర్లు ఇలాగే చెప్పుకోవాల్సి వచ్చింది. మా సినిమా యూత్ ఫిలిం నే. ఫ్యామిలీ సినిమా మాత్రమే కాదు అని. 

సరే, ఆ సంగతి అలా వుంచి ట్రయిలర్ ను వీక్షిస్తే కలర్ ఫుల్ ట్రయిలర్. అందమైన అమ్మాయి..అమ్మాయి. మాంచి సపోర్టింగ్ స్టార్ కాస్టింగ్. నిర్మాణ విలువలు. చెప్పుకోదగిన ఓ డైలాగు. అంతకు మించి ట్రయిలర్ లో మరేం రివీల్ చేయలేదు. కొంత దాచేసాం అని కూడా మేకర్లు చెప్పుకొచ్చారు. ఆ కొంత ఏమిటో థియేటర్లో చూడాలి.

పెళ్లి చూపులు కాన్సెప్ట్ నే నచ్చని పొగరు బోతు అమ్మాయి. ఆ పిల్ల పెళ్లి కోసం తల్లి గుబులు. నచ్చని పెళ్లి చేసి సాధించేది ఏమిటి అని తండ్రి సముదాయింపు. అలాంటి అమ్మాయిని తన దారికి తెచ్చుకోవాలని, తెలిసిన పులిహోర రెసిపీలు అన్నీ ట్రయ్ చేసే అబ్బాయి. ఇవే ట్రయిలర్ లో కనిపించాయి.

ఇంతకీ ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఎందుకు దూరం పెడుతోంది. చివర మళ్లీ ఆ పీక్ ఎమోషన్లు ఏమిటి అన్నది కూడా థియేటర్ లోనే చూడాలి. 

నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకురాలు.