పవన్ కల్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో కొత్త సినిమా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. తెరవెనక అన్నీతానై త్రివిక్రమ్ నడిపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా త్రివిక్రమే అందించాడు. కాకపోతే హారిక-హాసిని బ్యానర్ తో ఉన్న ఒప్పందం మేరకు తన పేరు వేయించుకోవడం లేదు. దానికి బదులుగా తనకు చెందిన నిర్మాణ సంస్థను ఈ ప్రాజెక్టుకు ఎటాచ్ చేశాడు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ ను తాజాగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సంయుక్త మీనన్ ను ఇందులో సాయితేజ్ సరసన హీరోయిన్ గా లాక్ చేశారంట. ఇది కూడా త్రివిక్రమ్ సిఫార్సుతోనే జరిగినట్టు సమాచారం.
భీమ్లానాయక్ సినిమాతో త్రివిక్రమ్ కు, సంయుక్త మీనన్ కు అసోసియేషన్ ఏర్పడింది. ఆ అనుబంధంతోనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను సంయుక్తకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ మేటర్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
వినోదాయ శితం సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ ప్రాజెక్టు. ఒరిజినల్ వెర్షన్ లో హీరో ఫ్యామిలీ మేన్. కూతురికి పెళ్లి చేసే వయసు ఉంటుంది అతడికి. రీమేక్ కు వచ్చేసరికి మాత్రం ఆ క్యారెక్టర్ లో పూర్తిగా మార్పుచేర్పులు చేశారు. సాయితేజ్ ను తీసుకొని, అతడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ను సెట్ చేసి పెట్టారు. సముత్తరఖని దర్శకత్వంలో వచ్చేనెల నుంచి సెట్స్ పైకి రాబోతోంది ఈ ప్రాజెక్టు.