బిగ్ బుల్ వచ్చేశాడు.. ‘ఇస్మార్ట్’ విలన్ ఇతడే

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా లాంఛ్ చేసి, అలా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిపోయారు. ఎప్పట్లానే ఫస్ట్ షెడ్యూల్ నుంచే ఈ…

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా లాంఛ్ చేసి, అలా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిపోయారు. ఎప్పట్లానే ఫస్ట్ షెడ్యూల్ నుంచే ఈ సినిమాకు ప్రచారం మొదలుపెట్టింది టీమ్. ఇందులో భాగంగా డబుల్ ఇస్మార్ట్ లో విలన్ పాత్రను పరిచయం చేశారు. అతడే సంజయ్ దత్.

ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ ను తీసుకున్నారనే ప్రచారం మొదట్నుంచి ఉంది. ముంబయిలో జరిగిన మొదటి షెడ్యూల్ కే సంజయ్ దత్ జాయిన్ అయ్యాడు.

ఈరోజు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సినిమాలో సంజయ్ దత్ పాత్ర పేరు బిగ్ బుల్. క్రూరత్వంతో నిండిన సంజయ్ దత్ ముఖాన్ని ఈరోజు ఆవిష్కరించారు. ముఖం, చేతి వేళ్లపై టాటూలతో, సిగార్ వెలిగిస్తూ కనిపించాడు సంజూ. అతడిపై తుపాకులు గురిపెట్టి ఉన్నాయి.

చూడ్డానికి ఎంత క్రూరంగా ఉన్నాడో, అంతే స్టయిలిష్ గా కూడా కనిపిస్తున్నాడు సంజయ్ దత్. నిజానికి పూరి జగన్నాద్ సినిమాల్లో హీరోలతో పాటు విలన్లు కూడా స్టయిల్ గానే ఉంటారు. సంజయ్ దత్ కూడా అదే ఫార్మాట్ లో కనిపించాడు. డబుల్ ఇస్మార్ట్ లో ఎంట్రీపై సంజయ్ దత్ స్పందించాడు. పూరి, రామ్ తో కలిసి సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్ టైనర్ చేయడం ఆనందంగా ఉందన్నాడు.

అతి త్వరలో ఈ సినిమాలో హీరోయిన్ల వివరాల్ని వెల్లడించబోతున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డబుల్ ఇస్మార్ట్ మూవీని.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మహా శివరాత్రి కానుకగా వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేస్తారు.