ఇట్స్ ప్రమోషన్ మ్యాటర్స్

ఇకపై ఎవరు సినిమాలు చేసినా ఇవన్నీ ఓ రూల్ బుక్ గా చూసుకోవడం అవసరం. పాటలు హిట్ కావాలి. ప్రచారం కొత్త పుంతలు తొక్కాలి. కంటెంట్ బాగుండాలి.

అంతే ఒక్కో సినిమాకు అలా కుదరుతుంది. దర్శకుడి సృజన, హీరో కోపరేషన్.. పీఆర్ టీమ్ కష్టం.. అన్నీ కలిసి ప్రమోషన్ న ఓ లెవెల్ కు తీసుకెళ్తాయి. ఇది డబ్బులతో జరిగిపోయే పని కాదు. అలా అయితే ప్రతి సినిమాకు గట్టిగా ఖర్చు చేస్తారు. కొన్ని సినిమాలు తమ ప్రమోషన్ ను తామే తెచ్చుకుంటాయి.

గత ఏడాది హనుమాన్ అలాగే తెచ్చుకుంది. ఎలా అయినా హనుమాన్ ప్రమోషన్ అన్నట్లు జరిగిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అలాగే జరిగింది. ఏ టీవీ షో చూసినా, ఏ మాధ్యమం చూసినా ఫుల్ గా వాడేసినట్లు కనిపించింది. సాంప్రదాయంగా జరిగే ప్రెస్ మీట్ లు, ఇంటర్వూలు మామూలే.

దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాకు ప్రచారం తీసుకురావడానికి తన సర్వ శక్తులు ధారపోసారు. నిజానికి నిర్మాత దిల్ రాజు సినిమాలకు పబ్లిసిటీ వీక్ గా వుంటుంది. కానీ ఫర్ ఏ ఛేంజ్ ఈసారి ఆయన రెండు సినిమాలు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం కూడా మంచి ప్రచారం అందుకున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ప్రచారం స్టార్ట్ చేయడమే విభిన్నంగా స్టార్ట్ చేసారు.

మీడియాను సినిమా కథ గెస్ చేయమని, దానికి స్టేజ్ మీద వెంకీ మామ హావభావాలు ప్రదర్శించి హడావుడి చేసారు. గోదారి గట్టు మీద సాంగ్ విడుదల చేసిన తరువాత రీల్స్ తో వైరల్ చేసారు. టీజర్, సాంగ్స్, ట్రయిలర్ విడుదల అయిన ప్రతి కంటెంట్ హిట్ కొట్టింది. వాటితో సాగించిన ప్రచారం అంతకన్నా హిట్టు కొట్టింది.

సినిమా వర్క్ పూర్తయ్యాక వెంకటేష్ తో చేసిన రకరకాల షార్ట్ స్కిట్ లు, రీల్స్ డైలీ ఏదో ఒక కంటెంట్ వదలుతూనే వచ్చారు. ఒక దశలో సోషల్ మీడియాలో ఇక ప్రచారం ఆపేయండి రా బాబూ, మీ సినిమా చూస్తాం గానీ అంటూ కౌంటర్లు వేయడం ప్రారంభించారు. అయినా కూడా పబ్లిసిటీ కి ఫుల్ స్టాప్ పెట్టలేదు. హీరోయిన్లు, హీరో, దర్శకుడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి టీవీ షో ని వాడుకున్నారు. మొక్కుబడిగా చేసి రాలేదు. వాటిల్లో పక్కాగా పాల్గొన్నారు.

ఇవన్నీ చేయడం తో పాటు కంటెంట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా మూడు పాటలు హిట్ కావడం అన్నది సినిమాకు ప్లస్ అయింది. పాటలు హిట్ కాకుండా వుండి వుంటే ఎంత వైవిధ్యమైన ప్రచారం సాగించినా ఫలితం లేకుండా వుండేది. హిట్ అయిన పాటలు కూడా హుషారైన పాటలు. మాస్ ను స్టెప్ వేయించే పాటలు అందుకే..సంక్రాంతి వస్తున్నాం సినిమాకు అంత ప్రీ రిలీజ్ బజ్ వచ్చింది. అంత ఓపెనింగ్ తీసుకుంది.

ఇకపై ఎవరు సినిమాలు చేసినా ఇవన్నీ ఓ రూల్ బుక్ గా చూసుకోవడం అవసరం. పాటలు హిట్ కావాలి. ప్రచారం కొత్త పుంతలు తొక్కాలి. కంటెంట్ బాగుండాలి.

4 Replies to “ఇట్స్ ప్రమోషన్ మ్యాటర్స్”

  1. game changer ki promotion ekkada vundhi ra babu..not even a single press meet in chennai bangalore n kerala

    hindi lo kuda edho nam ke vasthe velli vacharu..not even a single interview with lead actors.kaneesam promotions tho buz create chesi tickets booking two days mundhu kaakunda kaneesam 5days mundhu open chesi vunte weekend varaku aina full booking ayyedhi..producer failed in all aspects including control overe budget..150cr lopu budget petti vunte safe venture ayyedi..

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.